Share News

CM Revanth: వరదల్లో చనిపోయిన వారి కోసం సీఎం రేవంత్ కీలక ప్రకటన

ABN , Publish Date - Sep 02 , 2024 | 12:50 PM

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు, వరద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతూ కీలక ప్రకటన చేశారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

CM Revanth: వరదల్లో చనిపోయిన వారి కోసం సీఎం రేవంత్ కీలక ప్రకటన
CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 2: తెలంగాణలో (Telangana) భారీ వర్షాలు (Heavy Rains) , వరద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతూ కీలక ప్రకటన చేశారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. సోమవారం కమాండ్ కంట్రోల్ రూంలో వర్షాలపై సమావేశం నిర్వహించారు.

Chandrababu: సీఎం చంద్రబాబు దెబ్బకు అధికారుల పరుగులు


చనిపోయిన పాడి గేదెలు ఒక్కో దానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచాలని, మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే రూ. 3 వేల సాయం రూ.5 వేలకు పెంచాలని సీఎం ఆదేశించారు. తక్షణం బాధిత కుటుంబాలకు అందించాలని సూచించారు. వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహరం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయలని ఆదేశించారు. కంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

Husband: భార్య జ్ఞాపకాల్లో..


ప్రధానికి విజ్ఞప్తి...

రాష్ట్రంలోనే కాకుండా, జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలు 24 గంటలు పని చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, నిత్యావసర వస్తువుల పంపిణీ,, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టంపై అన్ని విభాగాల నుంచి ప్రాథమిక నివేదికలు తెప్పించి, కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కోరేందుకు నివేదికను సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ అధికార బృందాలతో పాటు స్వయంగా ప్రధాన మంత్రి ఈ విపత్తును పరిశీలించేందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.


టీజీడీఆర్‌ఎఫ్ ఏర్పాటు....

భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (TGDRF) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్తు సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని గుర్తు చేశారు. అదే విధంగా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్తు సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి నష్టాలను నివారించాలని చెప్పారు. వాగులు, వంకలు పొర్లుతున్న దృష్ట్యా దెబ్బతిన్న రోడ్లు, వరద ప్రవహిస్తున్న రోడ్లపై నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. రెవిన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులు బృందాలు ఏర్పడి అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలిపారు.


ఇవి కూడా చదవండి...

NRI: ముగిసిన ఆప్త 16వ వార్షికోత్సవం

Seethakka: భారీ వర్షాలపై మంత్రి సీతక్క సమీక్ష

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 02 , 2024 | 02:22 PM