Share News

AP Govt: ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు జీతాల టెన్షన్.. అంతలోనే..!!

ABN , Publish Date - Sep 02 , 2024 | 12:11 PM

Andhrapradesh: ఏపీలో భారీ వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. వరద సహాయక చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం నుంచి వరద సహాయక చర్యలు కోసం నిధులు డ్రా చేసేందుకు ట్రెజరీలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

AP Govt: ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు జీతాల టెన్షన్.. అంతలోనే..!!
AP Government Employees

అమరావతి, సెప్టెంబర్ 2: ఏపీలో భారీ వర్షాలు (Heavy Rains) ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. వరద సహాయక చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం నుంచి వరద సహాయక చర్యలు కోసం నిధులు డ్రా చేసేందుకు ట్రెజరీలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నిన్నటి నుంచి నిధులు డ్రాకు ప్రభుత్వం (AP Govt) అనుమతి ఇచ్చింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్లో జీతాలు, పెన్షన్ల భయం నెలకొంది.

Heavy Rains: సీఎం చంద్రబాబు వెళ్లొచ్చినా అధికారుల్లో రాని మార్పు


ఓవైపు వరద సహాయ చర్యలకు నిధులు డ్రా అవుతన్న తరుణంలో.. జీతాలు, పెన్షన్లు పడతాయా లేవోనన్న ఆందోళనలో ఉద్యోగులు ఉండిపోయారు. అయితే అనూహ్యంగా సోమవారం ఉదయం 8 గంటలలోపు ఉద్యోగులు, పెన్సనర్లకు అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయిపోయాయి. ఉదయం ఉద్యోగులు, పెన్షనర్ల అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులను జమ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు మొత్తం 5 వేల 500 కోట్లు రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. ఓవైపు విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ సరైన సమయానికి జీతాలు పడటం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు.


కాగా.. ఏపీలో వర్షాలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ప్రాజెక్టుల్లోకి వరద నీరు అంతకంతకు పెరుగుతూ ప్రమాదకర స్థితిలోకి చేరుకుంటున్నాయి. భారీ వర్ షాలపై ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్షాలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు.. గేట్‌కు డ్యామేజీ.. ఎన్నో అనుమానాలు!


ఫలించిన చంద్రబాబు ప్రయత్నం...

మరోవైపు విజయవాడకు పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయక చర్యల విషయమై మాట్లాడారు. పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రయత్నాలు ఫలిస్తూ.. వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు కేంద్రం బోట్స్‌ను పంపించింది. మరోవైపు లుధీయానా నుంచి ఆర్మీ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో బొట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్లాయి. సుమారు 100 మందితో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులను వేగవంతం చేయడం జరిగింది. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిల్స్‌ను ప్రభుత్వం అందిస్తోంది. ప్రైవేటు హోటల్స్, దుర్గ గుడి, అక్షయ పాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చుతోంది.


ఇవి కూడా చదవండి...

Trains cancelled: భారీ వర్షాలకు 432 రైళ్లు రద్దు..

Husband: భార్య జ్ఞాపకాల్లో..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 02 , 2024 | 12:24 PM