TS NEWS: లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి
ABN , Publish Date - Feb 23 , 2024 | 06:16 PM
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nandita) భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తదితరులు ఉన్నారు.
సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nandita) భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తదితరులు ఉన్నారు.
కాగా.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతి చెందారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్ (ORR)పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి, ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు.