CM Revanth Reddy: ప్రత్యర్థుల ఆశలు నెరవేరలేదు: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:29 PM
న్యూఢిల్లీ: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో గందరగోళం నెలకొందని, ఇప్పుడు అంతా సర్ధుకుందని.. పరిస్థితి చక్కబడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని సీఎం తెలిపారు.
న్యూఢిల్లీ: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) చేరికతో గందరగోళం నెలకొందని, ఇప్పుడు అంతా సర్ధుకుందని.. పరిస్థితి చక్కబడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని సీఎం తెలిపారు. ఢిల్లీ పర్యటనలో (Delhi Visit) ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యాశాఖ తన పరిధిలోనే ఉందని, అన్ని పరీక్షలు సవ్యంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. శాఖలకు మంత్రులు లేరనడం సరికాదన్నారు. మంత్రులు నిరంతరం సమీక్షలు చేస్తున్నారని, జీవన్‌రెడ్డి (Jeevan Reddy) వల్ల కాంగ్రెస్ (Congress)కు నష్టం జరగాలని.. గుంట నక్కలు ఎదురుచూస్తున్నాయని, ప్రత్యర్థుల ఆశలు నెరవేరలేదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఫామ్ హౌస్‌లో పడుకోవడానికి తాను కేసీఆర్ (KCR)ని కాదని, క్యాలెండర్ డేట్ ప్రకారం నిర్ధిష్టంగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యాశాఖ మీద అనేక రివ్యూలు చేశామని, ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదని అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారని, సమర్థవంతంగా పని చేస్తున్నారని చెప్పారు. కేంద్రంలో అన్ని శాఖల మంత్రులను కలుస్తున్నామని, బీజేపీ పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కూడా కేంద్రాన్ని కలవలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్‌కు సిగ్గు ఉండాలి... ఆయనకు మతి తప్పిందని, 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలోకి తీసుకున్నారని, ఫిరాయింపులకు పునాది వేసింది కేసీఆరేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌కు ఓట్లు వేయకపోతే ప్రజల తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేయించారని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కులగొట్టాలని చూస్తున్నారంటూ కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసుకొని కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు...పక్క రాష్టంతో సంబంధాలు కొనసాగిస్తామని, రోజుకు 18 గంటలు పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్‌పై కమిషన్ తాము ప్రతిపాదించలేదని.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారని, దీంతో రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించామన్నారు. వాళ్లు కమిషన్ అడిగారు.. మేము కమిషన్ వేశామని.. కేసీఆర్ తన వాదనను కమిషన్ ముందు వినిపించుకునే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్
సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సుప్రీం కోర్టుకు వెళ్దాం: కేసీఆర్
డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ భారీ మాయ..
బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News