Share News

CM Revanth: నీట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలి

ABN , Publish Date - Jun 24 , 2024 | 09:55 PM

నీట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పరీక్ష నిర్వహణలో కేంద్రం విఫలం అయిందని మండిపడ్డారు. సీబీఐ విచారణ సరిపోదని చెప్పారు.

CM Revanth: నీట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలి
CM Revanth Reddy

ఢిల్లీ: నీట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పరీక్ష నిర్వహణలో కేంద్రం విఫలం అయిందని మండిపడ్డారు. సీబీఐ విచారణ సరిపోదని చెప్పారు. కోట్లాదిమంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన అంశం, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రధాని మోదీ మౌనం వహించడం సరికాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆహ్వానించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు పోచారం శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి పరిచయం చేశారు.

కాగా.. నేడు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ బిజీ బిజీగా గడిపారు. పలువురు కేంద్రమంత్రులను కలిసి తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే ఏఐసీసీ అగ్రనేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్ష ఎంపిక, తదితర కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. రేపు సాయంత్రం హైదరాబాద్ తిరిగి రానున్నారని సమాచారం.


CM-R-4.jpg

రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే ప్రారంభం: పోచారం

తన రాజకీయ జన్మ మొదలైంది కాంగ్రెస్‌తోనే, చివరకు ముగిసేది కాంగ్రెస్‌లోనే అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరా, పదేళ్లు కేసీఆర్ నాయకత్వంలో పనిచేశానని అన్నారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆరునెలలుగా పరిపాలనను గమనిస్తున్నా, అంకితభావంతో రేవంత్ నడుపుతున్నారని వివరించారు. రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పాలన అందిస్తున్నారని కొనియాడారు. రైతులకు మంచి జరగాలనే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ తాను, తన అనుచరులు మొత్తం కాంగ్రెస్‌లో చేరారు అని పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 10:22 PM