CM Revanth: చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సిందే.. కేటీఆర్‌కు రేవంత్ వార్నింగ్..
ABN , Publish Date - Mar 29 , 2024 | 06:15 PM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై తెలంగాణ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఫోన్లు విన్నామని కేటీఆర్ అంటున్నారని, అలా చేసి ఉంటే చర్లపల్లి జైలులో చిప్ప కూడు తినాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth) Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి బోయలతో సమావేశమైన ఆయన రాజకీయాంశాలతో పాటు.. ఫోన్ ట్యాపింగ్‌పై స్పందించారు. కొంతమంది ఫోన్లు విన్నామని కేటీఆర్ (KTR) అంటున్నారని, అలా చేసి ఉంటే చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలోనే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని.. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేసినా అధికారులు ఎవరూ పట్టించు కోలేదన్నారు. పొరపాట్లు చేయ్యొద్దని గతంలో చెప్పినా అధికారులు వినిపించుకోకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. తప్పులు చేసినందుకే కొందరు అధికారులు జైలుకు వెళ్లారన్నారు. కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని, ఇప్పటి కైనా అహంకారం తగ్గించుకోవాలన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమిటన్నారు. ఎవరైనా ఇతర కుటుంబ సభ్యుల కాల్స్ వింటారా అని రేవంత్ ప్రశ్నించారు. భార్య, భర్తల మధ్య ఫోన్లు వినే దుర్మార్గానికి గత ప్రభుత్వం పాల్పడిందన్నారు. కొంతమంది ఫోన్లు విన్నామని కేటీఆర్ అంటున్నారని.. మంది సంసారాల్లో వేలు పెట్టి చూడాల్సిన అవసరం కేటీఆర్‌కు ఎందుకు వచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోందని తెలిపారు.
Big Breaking: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం
వందరోజుల పాలనపై..
తెలంగాణలో కాంగ్రెస్ వందరోజుల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము అమలు చేసిన పథకాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. ఢిల్లీలో ఇతర రాష్ట్రాల నేతలను కలిసినప్పుడు తెలంగాణ గురించి చర్చించుకుంటున్నారన్నారు. వంద రోజులపాటు పూర్తిగా అభివృద్ధిపైనే దృష్టి సారించామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు. మొదటి నెల 4వ తేదీన, రెండో నెల ఒకటో తేదీన జీతాలు ఇచ్చామన్నారు. ప్రజా సమస్యలపై వచ్చిన వారందరినీ కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తన ఇంటికి వచ్చి కలుస్తున్న ప్రజల సమస్యలు విని.. పరిష్కరిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఓట్లు వేసిన ప్రజలను బయట పెట్టిందని ఆరోపించారు.
కాంగ్రెస్‌పై కుట్ర..
మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్‌ను ఓడించి రేవంత్ రెడ్డిని బలహీనపర్చే కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయన్నారు. పదేళ్లుగా మోదీ ప్రధానిగా ఉండి మహబూబ్ నగర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. ఏం ముఖం పెట్టుకుని మహబూబ్ నగర్ లో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారన్నారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వాల్మీకి బోయల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
CM Revanth Reddy: రేవంత్‌తో కేకే భేటీ.. రాజకీయ వర్గాల్లో కలకలం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..