Share News

CM Revanth Reddy: రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారు

ABN , Publish Date - Sep 16 , 2024 | 05:37 PM

రాజీవ్ గాంధీ త్యాగం గురించి కొందరికి తెలియదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం సర్వం త్యాగం చేసిందని గుర్తుచేశారు.

CM Revanth Reddy: రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారు
CM Revanth Reddy

హైదరాబాద్: సచివాలయం ఎదురుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. విపక్షాలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌ కమాండ్ కంట్రోల్‌లో మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడారు. కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజీవ్ గాంధీ త్యాగం గురించి కొందరికి తెలియదని మండిపడ్డారు. గాంధీ కుటుంబం దేశం కోసం సర్వం త్యాగం చేసిందని గుర్తుచేశారు. స్వాతంత్య్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర జవహర్‌లాల్ నెహ్రూదని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.


ALSO READ: Bandi Sanjay: విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్ జంకుతుంది

స్వాతంత్య్రం తర్వాత దేశాన్ని ఐక్యంగా ఉంచిన నేత జవహర్‌లాల్ నెహ్రూ అని సీఎం రేవంత్ ప్రశంసించారు. తొలి ప్రధానిగా దేశాన్ని నెహ్రూ ఐక్యంగా నడిపించారని ఉద్ఘాటించారు. నెహ్రూ నేతృత్వంలో సర్దార్‌ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా పనిచేశారని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు.


ALSO READ: Ponnam Prabhakar: గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా..

‘‘మీ ఫామ్ హౌస్‌లలో జిల్లేడు మొలిపిస్తా. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ కంప్యూటర్ తెచ్చిందే రాజీవ్ గాంధీ కదా. లేకపోతే గుంటూరులో ఇడ్లీ,వడ అమ్ముకునే వానివి. నువ్వు ఐటీ శాఖ మంత్రివి అయ్యావు అంటే అది రాజీవ్‌గాంధీ చొరవే. పదవి , ప్రాణ త్యాగం అంటే గాంధీ కుటుంబానిది మాత్రమే. అయ్యా ముఖ్యమంత్రి.. కొడుకు మంత్రి , అల్లుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, ఒకరు రాజ్యసభ. గడీలలో గడ్డి మొలిచింది. వేల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టిన నీకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.


ALSO READ: KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం

రాజీవ్ గాంధీ విగ్రహం టచ్ చేస్తే.. సీఎం రేవంత్ వార్నింగ్

‘‘బుద్దిని పక్కన బుద్ది లేని వాని విగ్రహం పెట్టాలని ఈ స్థలాన్ని రిజర్వ్ చేసి పెట్టిర్రు. ఆ గాడిదలకు బుద్ది లేదు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి బిడ్డా. ఎవడు వస్తాడో రండి దారి చెప్పండి.నేను చూస్తా. రాజీవ్‌గాంధీ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దేశం అబ్బురపడే రీతిలో చేస్తాం. కొండా లక్ష్మణ్ బాపూజీకి విలువ ఇవ్వని సన్నాసి కేసీఆర్. నువ్వు నీ కొడుకు తెగించి దోచుకోవడం. కాలకేయ ముఠా, మీడత దండు నుంచి తెలంగాణను కాపాడుకుందాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన విమర్శలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

TG Politics: తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త చీఫ్ ముందున్న అతిపెద్ద సవాల్.. గెలిస్తే తిరుగుండదు..

Kaushik Reddy: రేవంత్ రెడ్డి.. నీ గుండెల్లో నిద్రపోతా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

TG News: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా?.. ఆత్మహత్యా?

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 16 , 2024 | 06:03 PM