Share News

Adi Srinivas: సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ సోషల్ మీడియావి కారుకూతలే...

ABN , Publish Date - Aug 12 , 2024 | 04:10 PM

Telangana: రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న రేవంత్‌పై సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశారన్నారు. పెట్టబడులకు తెలంగాణను స్వర్గంగా మార్చుతున్నారని అన్నారు.

Adi Srinivas: సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ సోషల్ మీడియావి కారుకూతలే...
Congress Leader Adi Srinivas

హైదరాబాద్, ఆగస్టు 12: రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న రేవంత్‌పై సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Adi Srinivas) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశారన్నారు. పెట్టబడులకు తెలంగాణను స్వర్గంగా మార్చుతున్నారని అన్నారు. రేవంత్ అమెరికా పర్యటన విజయవంతం కావడం బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. సూటు బూటు వేసుకొని దావోస్ వెళ్లిన కేటీఆర్ ఎన్ని కంపెనీలను తెలంగాణకు తెచ్చారని ప్రశ్నించారు.

YSRCP : టీడీపీ హయాంలోనూ వైసీపీ కాంట్రాక్టర్ దబాయింపులు.. ఎక్కడంటే?



కేటీఆర్ ఏంవోయూ కుదుర్చుకున్న కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్నారు. ఒప్పందం చేసుకున్న కంపెనీలకు గత ప్రభుత్వం సరైన వసతులు కల్పించలేదని విమర్శించారు. రేవంత్ సక్సెస్ తక్కువ చేసి చూపించేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కష్టపడుతోందని వ్యాఖ్యలు చేశారు. బుర్రలేని వాళ్ళు కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు. అంగుళం భూమి కేటాయించకముందే మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. తప్పులు చేసి తీహార్ జైల్లో ఎవరున్నారో ప్రజలకు తెలుసన్నారు. కేటీఆర్ పదేండ్ల సూటు బూటు హడావిడికి రేవంత్ కేవలం 8 నెలల్లోనే సమాధానం చెప్పారని అన్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, మరోవైపు ప్రైవేట్ ఉద్యోగాల కల్పన చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు.

Telangana: సాహసాల ‘డ్రిల్ మ్యాన్’.. ప్రపంచం గుర్తించింది కానీ ప్రభుత్వం గుర్తించలే..!


తెలంగాణ అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మూడు సార్లు దావోస్ పోయి కంపెనీలు తెచ్చానన్న కేటీఆర్ దానిలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘విదేశీ పర్యటనల పేరుతో దుబాయి వెళ్లి సొంత బిల్డింగులు కొనుక్కున్న మీతో రేవంత్‌కుకి పోలికా?’’ అంటూ మండిపడ్డారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి దిగజారవద్దని బీఆర్ఎస్ నేతలకు సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే వారి పని ఖతం అవుతుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

TG Minister: ఖమ్మంలో కొనసాగుతున్న తెలంగాణ మంత్రుల పర్యటన

Arvind Kejriwal: జెండా ఎగురవేయడంపై ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ.. జైలు అధికారులు అభ్యంతరం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 12 , 2024 | 04:12 PM