Share News

TS Politics: శివాజీ చరిత్రను బీజేపీ వక్రీకరించింది.. సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Feb 19 , 2024 | 04:12 PM

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంత్రి వేడుకలను బీజేపీ, సీపీఐ నేతలు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల సందర్భంగా కమలం నేతలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) తీవ్ర విమర్శలు గుప్పించారు.

TS Politics: శివాజీ చరిత్రను బీజేపీ వక్రీకరించింది.. సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

హైదరాబాద్: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంత్రి వేడుకలను బీజేపీ, సీపీఐ నేతలు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల సందర్భంగా కమలం నేతలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) తీవ్ర విమర్శలు గుప్పించారు. సీపీఐ కార్యాలయంలో సోమవారం శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణ, పలువురు సీపీఐ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. శివాజీని రాజకీయంగా బీజేపీ వాడుకుంటుందని మండిపడ్డారు. బీజేపీ రాజకీయం కోసం శివాజీని హిందూ మతోన్మాదిని చేసిందని ఆరోపించారు.

శివాజీ చరిత్రను బీజేపీ వక్రీకరించిందని విరుచుకుపడ్డారు. ఆయన లౌకిక వాది అని చెప్పారు. మోదీ క్యాబినెట్‌లో ముస్లింలకు చోటు లేదని.. ఆనాడే శివాజీ సైన్యంలో ముస్లింలకు చోటు కల్పించారని చెప్పారు. శివాజీ జీవితంపై గోవింద్ పన్సారే అనే కమ్యూనిస్టు పుస్తకం రాస్తే.. అతడిని చంపేశారని ధ్వజమెత్తారు. బీజేపీకు వ్యతిరేకంగా ఉన్న వారిపై దాడులు చేస్తున్నారని.. కేసులు పెడుతున్నారని సీపీఐ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 04:30 PM