Share News

BV Raghavulu: భూమాతపై రైతుల్లో చర్చ పెట్టి.. అమలు చేయాలి

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:42 PM

Telangana: భూమాత పోర్టల్‌పై రైతులతో చర్చ పెట్టాల్సిందే అని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులతో చర్చ తరువాతే అమలు చేయాలన్నారు. భూ మాత పేరుతో కాంగ్రెస్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నారని అన్నారు. బీజేపీ మతతత్వ ఆలోచనల్ని కనసాగిస్తోందని మండిపడ్డారు.

BV Raghavulu: భూమాతపై రైతుల్లో చర్చ పెట్టి.. అమలు చేయాలి
CPM Leader BV Raghavulu

హైదరాబాద్, ఆగస్టు 24: భూమాత పోర్టల్‌పై రైతులతో చర్చ పెట్టాల్సిందే అని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (CPM Leader BV Raghavulu) స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులతో చర్చ తరువాతే అమలు చేయాలన్నారు. భూ మాత పేరుతో కాంగ్రెస్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నారని అన్నారు. బీజేపీ మతతత్వ ఆలోచనల్ని కనసాగిస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ చేస్తామని మోడీ చెప్పారని... వక్ఫ్‌బోర్డు చట్టంలో అభ్యంతరకరమైన మార్పులు తీసుకు రావాలని బీజేపీ చూస్తోందన్నారు. వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను కమిటీలో పెట్టాలని చూస్తున్నారన్నారు.

PM Modi: రెండు దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరిన మోదీ


మతాల మధ్య విభజన తేవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. రాబోయే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందన్నారు. ఉత్తరాఖండ్‌లో తీసుకువచ్చిన బిల్లు చాలా ఘోరంగా ఉందన్నారు. దేశంలో అగ్రీస్ యాక్ట్ అమలు చేయాలని కేంద్రం చూస్తోందన్నారు. యాక్ట్ వలన రైతుల డేటా అంత ప్రైవేట్ కంపెనీల పరం అవుతుందన్నారు. నల్ల చట్టాలను పరోక్షంగా అమలు చేయాలని బీజేపీ చూస్తోందని బీవీ రాఘవులు వ్యాఖ్యలు చేశారు.


రుణమాఫీకి పక్కదోవ పట్టించాలని...

భూమాత పోర్టల్‌పై రైతుల్లో చర్చ పెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రుణమాఫీని పక్క దోవ పట్టించటానికి మంత్రులు, సీఎంలు, మాజీ సీఎంలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 2లక్షలు రుణమాఫీ చేస్తే రూ.31,000 కోట్లు ఖర్చు అవుతుందని కాంగ్రెస్ నాయకులు చెప్పారని తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇప్పుడు రూ. 18,000 కోట్లు రుణమాఫీ చేసి పూర్తిగా రుణమాఫీ అయ్యింది అంటే ఎలా? అని ప్రశ్నించారు.

Anitha: అబద్దాలు చెప్పడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య



రుణమాఫీకి రేషన్ కార్డు అవసరం లేదని రేవంత్ రెడ్డి నోటి మాట చెప్పారని అన్నారు. కానీ రుణమాఫీ కావాలంటే అధికారులు రేషన్ కార్డు అడుగుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం పర్యటనలు ఉంటే తమ సీపీఎం నేతలను ముందస్తు అరెస్ట్ చేశారని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు ఉంటే కూడా ముందస్తుగా సీపీఎం నేతలను అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలుఅమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29తేదీన రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తున్నామని తెలిపారు.


మాజీ సీఎం కేసీఆర్ అవలంభించిన విధానాలను కాంగ్రెస్ కొనసాగాస్తుందని ఆరోపించారు. రెండు గ్రామాల్లో రుణమాఫీపై స్టడి మని తెలిపారు. 1100 మందికి 300మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని తెలిపారు. కాంగ్రెస్.‌ బీజేపీని వదిలేసి బీఆర్ఎస్ వెంట పడుతుందని తెలిపారు. దీని వల్ల కాంగ్రెస్ నష్ట పోతుందని.. గతంలో కూడా బీఆర్ఎస్ ఇలాగే నష్టపోయిందని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

TG News: ఎన్నో కలలతో అత్తగారింట అడుగుపెట్టిన ఆ వధువు నెల తిరిగేసరికి...

Congress: సంస్కారం కావాలంటే మేము నేర్పిస్తాం... కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 24 , 2024 | 03:45 PM