Hyderabad: సీపీగా సీవీ ఆనంద్.. ఛార్జ్ తీసుకోవడమే ఆలస్యం స్ట్రాంగ్ వార్నింగ్..!
ABN , Publish Date - Sep 09 , 2024 | 10:37 AM
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రస్తుత సీపీ శ్రీనివాస రెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్‌ను మరింత మెరుగుపరుస్తామన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 09: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రస్తుత సీపీ శ్రీనివాస రెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్‌ను మరింత మెరుగుపరుస్తామని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఒక భాగం అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని.. నేరస్తులతో స్ట్రాంగ్ పోలీసింగ్ ఉంటుందని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. వినాయక నిమజ్జనం చాలా కీలకమైన అంశం అని, నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సీపీ ఆనంద్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైల్‌ను తాను ఇంకా చూడలేదన్నారు. ఈ కేసుపై ఒకసారి సమీక్ష నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విన్నానని.. ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. హత్యలు, అత్యాచారాలు, లా అండ్ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ స్పష్టం చేశారు.