Share News

Bhatti: హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి రియాక్షన్ ఇదీ..!

ABN , Publish Date - Aug 24 , 2024 | 04:23 PM

Telangana: హైదరాబాద్ హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్, రాక్స్ (సరస్సులు, రాళ్లు) అని.. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారన్నారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.

Bhatti: హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి రియాక్షన్ ఇదీ..!
Deputy CM Bhatti Vikramarka

న్యూఢిల్లీ, ఆగస్టు 24: హైదరాబాద్‌లో హైడ్రా (Hydra) కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్, రాక్స్ (సరస్సులు, రాళ్లు) అని.. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారన్నారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని చెప్పుకొచ్చారు.

Hyderabad: ముంబై-హైదరాబాద్.. మధ్యలోనే కుప్పకూలిన హెలికాప్టర్..


దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారన్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నారన్నారు. బఫర్ జోన్‌లో కాదు, నేరుగా చెరువులోనే కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారన్నారు. సాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నామని తెలిపారు. రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఫోటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతామన్నారు.


చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నామన్నారు. అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 04:30 PM