Share News

ED: భూదాన్ భూమి అన్యాక్రాంతంపై కొనసాగుతున్న ఈడీ విచారణ

ABN , Publish Date - Nov 07 , 2024 | 11:45 AM

Telangana: భూదాన్ భూమి అన్యాక్రాంతం వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్, తహశీల్దార్ జ్యోతిని విచారించిన ఈడీ.. తాజాగా ఆర్డీవో వెంకటాచారిని విచారిస్తోంది. ఈ భూమి విషయంలో అధికారులు కోట్లు పొందారని ఈడీ అనుమానిస్తోంది.

ED: భూదాన్ భూమి అన్యాక్రాంతంపై కొనసాగుతున్న ఈడీ విచారణ
ED inquiry into Bhudan land alienation

హైదరాబాద్, నవంబర్ 7: రంగారెడ్డి జిల్లా నాగరంలోని 42 ఎకరాల భూదాన్ భూమి అన్యాక్రాంతంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆర్డీవో వెంకటాచారిని ఈడీ విచారిస్తోంది. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్, తహశీల్దార్ జ్యోతి విచారణ ఆధారంగా ఆర్డీవోను ఈడీ ప్రశ్నిస్తోంది. భూదాన్ బోర్డ్‌కు చెందిన భుమిని ఖాదురున్నీసా అనే మహిళకు అధికారులు రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయల విలువైన భూమిని ఆర్డీవో , తహశీల్దార్ కలిసి ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ గుర్తించింది. దీని వలన అధికారులు కోట్లు రూపాయలు పొందినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక లావాదేవీలపైన ఆర్డీవో వెంకటాచారిని ఈడీ ప్రశ్నిస్తోంది.

Article 370: అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..


కాగా.. విజిలెన్స్ విచారణలో భూదాన్ భూముల భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇదే వ్యవహారంలో అప్పటి ఎమ్మార్వో జ్యోతిపై కేసు నమోదు అయింది. జ్యోతిపై కేసు నమోదు అయిన తరువాత విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరిపింది. దాదాపు 50 ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతం అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ ఉండడంతో ఆయనను ఈడీ విచారించింది.

AP Police: వేగంగా వెళ్తున్న కారుపై పోలీసులకు డౌట్.. చేజ్ చేసి చెక్ చేయగా షాక్..


అయితే రంగారెడ్డి జిల్లా నాగరంలోని సర్వే నెంబర్ 181, 182 లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఇందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డ్‌కు చెందినదని బోర్డ్ వాదిస్తోంది. అయితే ఈ భూమి జబ్బార్దస్త ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. తరువాత కాలంలో జబ్బర్దస్తూ ఖాన్ కొడుకు హజీ ఖాన్ ఈ 50 ఎకరాలు ల్యాండ్‌ను భూదాన్ బోర్డ్‌కు దానం చేశారు. అయితే 2021లో హజీఖాన్ వారుసరాలినంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా అనే మహిళ దరఖాస్తు చేసింది. దీంతో ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో , తహశీల్దార్, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఆమెకి అనుకూలంగా పని చేసినట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం ఈడీ విచారణలో మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

AP: ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు.. టార్గెట్ ఏమిటంటే..

Viral Video: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయబోయిన వ్యక్తి.. ఆ తర్వాత జరిగిందిదే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 11:48 AM