Telangana: ఈ సమ్మర్‌లో బీరు ప్రియులకు కష్టమే..!
ABN , Publish Date - Apr 04 , 2024 | 10:31 AM
Telangana: తెలంగాణలో త్వరలో బీర్ల రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అందుకు గ్రేటర్‌లో తాగునీటి కొరతే కారణమా? డిమాండ్‌కు తగ్గట్లు బీర్లను బ్రూవరీలు సప్లై చేయలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా మందుబాబులకు చేదు వార్తనే చెప్పాలి..
హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణలో (Telangana) త్వరలో బీర్ల రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అందుకు గ్రేటర్‌లో తాగునీటి కొరతే కారణమా? డిమాండ్‌కు తగ్గట్లు బీర్లను బ్రూవరీలు సప్లై చేయలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా మందుబాబులకు చేదు వార్తనే చెప్పాలి.
ఇదీ సంగతి...
భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తెలంగాణలో నీటి కొరత తీవ్రంగా ఉంది. తాగు నీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు బీర్ల తీయారీపై కూడా నీటి కొరత ప్రభావం చూపుతోంది. గ్రేటర్‌లోని బీర్ల తయారీ కంపెనీలపై నీటి ఎద్దడి ఎఫెక్ట్ భారీగానే పడుతోంది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బీర్ల అమ్మకాలు, ఉత్పాదనపై పెను ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిటీలోని తాగునీటి జలాశయాల్లో నీటి కొరత ఏర్పడింది. హైదరాబాద్‌లోని బీర్ల తయారీ కంపెనీలకు రోజుకు 44 లక్షల లీటర్ల నీళ్ల వినియోగం ఉంటుంది. గత నెలలో 48,71, 668 కేసుల బీర్ల విక్రయాలతో ఎక్సైజ్ శాఖకు రూ.1458 కోట్ల రాబడి వచ్చింది. అయితే డిమాండ్‌కు అనుగుణంగా బీర్లను బ్రూవరీలు సప్లై చేయలేని పరిస్థితి. 1999 తర్వాత తొలిసారిగా బీర్ల తయారీపై ఎఫెక్ట్ పడింది. బీర్ల కొరతతో రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సింగూరు, మంజీరా జలాశయాల నుంచి 44 లక్షల లీటర్లు నీరు ఆయా బ్రూవరీలకు అవసరం ఉంటుంది.
మొబైల్ ఫోన్‌తో పొన్నంకు ఇబ్బందులు!
బీర్ల కంపెనీలు.. నీటి వినియోగం
బ్రూవరీ నీటి పరిమాణం (లక్షల లీటర్లు)
ఎస్‌ఎబి మిల్లర్ ఇండియా (15లక్షల లీటర్లు)
యునైటెడ్ బ్రూవరీస్, మల్లేపల్లి (12లక్షల లీటర్లు)
యునైటెడ్ బ్రూవరీస్, కోత్లాపూర్ (5లక్షల లీటర్లు)
కార్స్ల్‌బెర్గ్ ఇండియా (7 లక్షల లీటర్లు)
క్రౌన్ ఇండియా (5లక్షల లీటర్లు).
గ్రేటర్‌లో పరిస్థితి ఏంటంటే?...
కాగా.. తెలంగాణ గత ఆరు నెలల్లో దాదాపు 57శాతనికి పైగా వర్షపాతం లోటు ఏర్పడింది. ఇటు గ్రేటర్ పరిధిలోనూ నీటి కొరత రోజు రోజుకు పెరుగుతోంది. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో నగరవాసులు ట్యాంకర్ల కోసం జలమండలిని సంప్రదిస్తున్న పరిస్థితి. గత మార్చి నెలలోనే దాదాపు 1.68లక్షల ట్యాంకర్ల నీటిని జలమండలి సరఫరా చేసిందంటే నీటి కొరత ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి...
BRS: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్
Delhi Liquor Case:బీజేపీ నెక్ట్స్ టార్గెట్ అదే.. జైలు నుంచి విడుదలయ్యాక సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...