Share News

Hyderabad: భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు

ABN , Publish Date - Dec 10 , 2024 | 02:22 PM

హైదరాబాద్‍లో కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో వాటి ధర అమాంతంగా పెరిగిపోయాయి. ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 7 పలుకుతోంది. ఇక సూపర్ మార్కెట్‍లో వీటి ధర రూ. 10గా విక్రయిస్తున్నారు.

Hyderabad: భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు

హైదరాబాద్, డిసెంబర్ 10: హైదరాబాద్ మహానగరంలో కోడి గుడ్డు ధర అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ఒకొక్క కోడిగుడ్డు రూ. 7 ధర పలుకుతోంది. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో కేక్‍లకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. ఇక వీటి తయారీలో కోడిగుడ్డను విరివిగా వినియోగిస్తారు. దీంతో కోడి గుడ్ల రేట్లు భారీ పెరిగాయి. నిన్న మొన్నటి వరకు ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 5 లేదా రూ. 6 మధ్య ఉండేది. 100 కోడిగుడ్ల ధర.. హోల్ సేల్‍గా రూ. 540 లేదా అంతకంటే తక్కువగా ఉండేది.

Also Read: కేబినేట్ భేటి ముందుకు జమిలి ఎన్నికల బిల్లు


అలాగే షాపుల్లో రూ. 6గా ఉండేది. కానీ కోడిగుడ్ల ధర మాత్రం ఇటీవల భారీగా పెరిగింది. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలోనే కోడిగుడ్డు ధర ఇంతలా పెరిగిందనే అభిప్రాయం అయితే సర్వత్ర వ్యక్తమవుతోంది. ఇక హోల్ సేల్ మార్కెట్‍లో 100 కోడిగుడ్ల ధర.. రూ. 620 ఉంది. అయితే రిటైల్ వ్యాపారులు మాత్రం 100 కోడిగుడ్లను రూ. 650కి విక్రయిస్తున్నారు.

Also Read: మమతకు మద్దతు తెలిపిన మాజీ సీఎం


అదే విధంగా రిటైల్ మార్కెట్‍లో మాత్రం 100 కోడిగుడ్ల ధర.. రూ. 700కి చేరుకుంది. సూపర్ మార్కెట్ లో వీటి ధర మరింత భారీగా పెరిగింది. ఒక్కో గుడ్డు ధర రూ. 10 మేర విక్రయిస్తున్నారు. మరోవైపు నేషనల్ ఎగ్ కో ఆర్డినేటడ్ కమిటీ (ఎన్ఈసీసీ) మాత్రం ఒక్కో గుడ్డు ధర రూ. 6.20గా నిర్ణయించింది.

Also Read: బస్సు బీభత్సం.. ఏడుగురు మృతి

Also Read: రాజ్యసభ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ


మరోవైపు.. కేకుల తయారీలో వినియోగించే పదార్ధాలకు సైతం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక ఇది ఏడాది చివర మాసం.. క్రిస్మస్, న్యూ ఈయర్ పండగల నేపథ్యంలో బిర్యానీకి సైతం భారీ డిమాండ్ ఉండనుంది. దీంతో చికెన్, మటన్ ధరలు సైతం ఆకాశ్నానంటే అవకాశాలున్నాయి. అలాగే కొత్త సంవత్సరం కావడంతో.. న్యూఈయర్ వేడుకలకు నాన్ వేజ్ తోపాటు మద్యానికి భారీ డిమాండ్ ఏర్పాడనుంది. దాంతో కొత్త సంవత్సరం వేళ.. మద్యం, మాంసం విక్రయాలతో వందల కోట్ల మేర వ్యాపారం జరగనుంది.

Also Read: మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత

Also Read: కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ కన్నుమూత


దేశంలోనే అత్యధిక కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. దేశంలోనే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతి రోజు 32 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి చేసే... దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు ప్రతి రోజు 15 కోట్ల కోడిగుడ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. రోజుకు 5 వేల కోడిగుడ్ల ఉత్పత్తితో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ తొలి, రెండో స్థానాల్లో ఉన్నాయి.

For Telangana News And Telugu News

Updated Date - Dec 10 , 2024 | 02:22 PM