TS NEWS: ఐఎస్‌సదన్‌లోని రాఘవేంద్ర హోటల్లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jan 07 , 2024 | 08:28 PM
నగరంలోని ఐఎస్‌సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాఘవేంద్ర హోటల్‌లో షాట్ సర్క్యూట్ జరిగింది. దాంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటినా ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని ఐఎస్‌సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాఘవేంద్ర హోటల్‌లో షాట్ సర్క్యూట్ జరిగింది. దాంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటినా ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ నిబంధనలు పాటించకపోవడంతోనే అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.