Harish Rao: వికారాబాద్ ఫార్మాసిటీ ఘటనపై హరీష్ రావు ఫైర్
ABN , Publish Date - Nov 11 , 2024 | 03:48 PM
Telangana: గరీబీ హటావో అని ఇందిరా గాంధీ గారు పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని పిలుపునిస్తున్నారు రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్‌రావు విరుచుకుపడ్డారు. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్నారు. ఆ రాయి ఈరోజు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడిందన్నారు.
హైదరాబాద్, నవంబర్ 11: వికారాబాద్ జిల్లా ఫార్మాసిటీ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గరీబీ హటావో అని ఇందిరా గాంధీ గారు పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని పిలుపునిస్తున్నారు రేవంత్ రెడ్డి అని విరుచుకుపడ్డారు. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్నారు. ఆ రాయి ఈరోజు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడిందన్నారు. అందుకే రైతులు రేవంత్ మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారని తెలిపారు.
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ఆ నేతకు నోటీసులు..
రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఎఎస్ లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారని తెలిపారు. ఫార్మా సిటీ కోసం కేసీఆర్ హైదరాబాద్‌కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్ధం చేసినట్లు తెలిపారు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చిన దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు బెడుతున్నారంటూ మండిపడ్డారు. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందన్నారు.
AP Budget 2024: బడ్జెట్‌కు ముందు పయ్యావులకు సీఎం ఏం చెప్పారో తెలుసా
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైందన్నారు. ‘‘నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని హరీష్ రావు డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లా లగ్గిచర్లలో ఫార్మా విలేజ్‌పై అభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై మహిళా రైతు చేయిచేసుకుంది. వెనుక నుంచి కలెక్టర్ భుజంపై కొట్టడం కలకలం రేపింది. ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ అధికారుల కార్లపై రాళ్లు రువ్వారు. రైతుల దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇవి కూడా చదవండి...
AP Budget 2024: బడ్జెట్‌కు ముందు పయ్యావులకు సీఎం ఏం చెప్పారో తెలుసా
Hardik Pandya: కావాలనే స్లోగా ఆడిన హార్దిక్.. ఇంత స్వార్థం దేనికి..
Read Latest Telangana News And Telugu News