Share News

Harish Rao: ఇప్పుడు ఎన్నికలు పెడితే జరిగేది ఇదే..

ABN , Publish Date - Oct 30 , 2024 | 03:33 PM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన బిక్ష అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ వచ్చేది కాదన్నారు. తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు, రేవంత్‌కు నక్కకూ.. నాగలోనికి ఉన్నంత తేడా ఉందన్నారు.

Harish Rao: ఇప్పుడు ఎన్నికలు పెడితే జరిగేది ఇదే..
Former Minister Harish Rao

హైదరాబాద్, అక్టోబర్ 30: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్‌కు 100 సీట్లు వస్తాయని మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన బిక్ష అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ వచ్చేది కాదన్నారు. తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు, రేవంత్‌కు నక్కకూ.. నాగలోనికి ఉన్నంత తేడా ఉందన్నారు. సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా రేవంత్ చూసుకోవాలంటూ హితవుపలికారు. కుర్చీని ఎప్పుడు ఎవరు గుంజుకుపోతారోనన్న భయంతో రేవంత్ ఉన్నారన్నారు. ఐదేళ్ళ తర్వాత వచ్చేది బీఆర్ఎస్ అని... సీఎం అయ్యేది కేసీఆర్ అని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ మూడు సార్లు ఓడిందని.. దాంతో కాంగ్రెస్ ఖతం అయిపోయిందా ప్రశ్నించారు.

Sharmila: అప్పుడు ఎంవోయూ చేశారు.. ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు..


రుణమాఫీ విషయంలో రేవంత్ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ఆరు మంత్రి పదవులను నింపడానికే రేవంత్‌కు హైకమాండ్ అనుమతి ఇవ్వట్లేదని.. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా నింపలేదన్నారు. రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి గోబెల్స్ కూడా సిగ్గుపడ్తారన్నారు. రేవంత్ రెడ్డి మాటలపై ప్రజలకు నమ్మకం పోతోందన్నారు. సీఎం మాటలు విన్న పిల్లలు.. వాటినే పరీక్షల్లో రాస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు మూడు దిక్కుల సముద్రం ఉందన్న రేవంత్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని అంటారని ఎద్దేవా చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు అమ్ముతారని రేవంత్ అనటం హాస్యాస్పదమని మాజీ మంత్రి అన్నారు.

Dhanteras: ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు.. ఎందుకంటే


మూసీని శుద్ధి చేయాలని సంకల్పించిందే కేసీఆర్ అని తెలిపారు. మూసీని శుద్ది చేయటానికి బీఆర్ఎస్ అనుకూలమని.. అయితే సుందరీకరణ పేరుతో పేదల ఇళ్ళను కూల్చటానికి మాత్రం బీఆర్ఎస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీపై బీఆర్ఎస్ వైఖరిని కేటీఆర్ చెప్తూనే ఉన్నారన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు తమకంటే బెటర్‌గా చేయవచ్చు కదా అని అన్నారు. మల్లన్నసాగర్ బాధితులకు గచ్చిబౌలిలో 500 గజాల్లో ఇళ్ళు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ అమలు చేయమంటే సస్పెండ్ చేయటం అన్యాయమన్నారు. ఏక్ పోలీస్ అమలు చేస్తామని ఎన్నికల్లో రేవంత్ చెప్పలేదా అని ప్రశ్నించారు. తనకు రక్షణ కల్పించే పోలీసులపై కూడా రేవంత్‌కు నమ్మకం లేకుండా పోయిందన్నారు. తండ్రే తన పిల్లలను నమ్మనట్లు.. రేవంత్ తీరుందన్నారు. కానిస్టేబుల్స్ సమస్యలు తెలుసుకునే సమయం సీఎంకు లేదా అని హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు.


ఇవి కూడా చదవండి...

Raghunandan: కాంగ్రెస్ సర్కార్‌పై ఎంపీ రఘునందన్ ఫైర్

Congress: గాంధీభవన్‌లో కులగణన సమావేశం.. నేతలు ఏంచెప్పారంటే

Read Latet Telangana News And Telugu News

Updated Date - Oct 30 , 2024 | 03:39 PM