Share News

Harish Rao: గ్రామాన్ని అభివృద్ధి చేసిన వారిని అరెస్ట్ చేస్తారా

ABN , Publish Date - Nov 04 , 2024 | 09:39 AM

Telangana: ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచ్‌లను అరెస్టులు చేయడమేనా అని హరీష్‌రావు ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచ్‌లకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచ్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Harish Rao: గ్రామాన్ని అభివృద్ధి చేసిన వారిని అరెస్ట్ చేస్తారా
Former Minister Harisha Rao

హైదరాబాద్, నవంబర్ 4: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్‌ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు(Former minister Harish Rao) తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో మాజీ మంత్రి పోస్టు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు.

Medical Expenses: వైద్య ఖర్చు అత్యల్పం!



ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచ్‌లను అరెస్టులు చేయడమేనా అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచ్‌లకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచ్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్‌రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.


కాగా.. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరుతూ మాజీ సర్పంచ్‌లు ఈరోజు (సోమవారం) పోరుబాటకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించిన మాజీ సర్పంచ్‌లు హైదరాబాద్‌కు వచ్చారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న హోటల్‌లో మాజీ సర్పంచ్‌లంతా సమావేశమయ్యారు. అయితే విషయం తెలిసిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాజీ సర్పంచ్‌లను హోటల్‌ నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. పోలీసులను తప్పించుకుని బయటకు వచ్చిన పలువురు మాజీ సర్పంచ్‌లను ఖాకీలు అరెస్ట్ చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో మాజీ సర్పంచ్ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, రేపాక నాగయ్య, గుర్రాల దండి ఆంజనేయులు, దుంప ఆంజనేయులు తదితరులు ఉన్నారు. అయితే పోలీసుల తీరుపై మాజీ సర్పంచ్‌లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాము శాంతియుతంగా పోరాడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని వారు ప్రశ్ని్స్తున్నారు మాజీ సర్పంచ్‌ల అరెస్ట్‌తో హోటల్‌ వద్ద కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.


ఇవి కూడా చదవండి...

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా కేటీఆర్ సంచలన ట్వీట్లు..

Gold and Silver Rates Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 11:09 AM