KTR: మరోసారి కాంగ్రెస్ సర్కార్‌పై దుమ్మెత్తిపోసిన కేటీఆర్
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:58 AM
Telangana: ‘‘అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా ! కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా ! దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలికేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపాం’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) దూషణలు కొనసాగుతూనే ఉన్నాయి. గురుకుల పాఠశాలలో సరైన భోజనం లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారంటూ మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో అన్నపూర్ణగా నిలిచిన తెలంగాణలో నేడు ఆకలికేకలు వినిపిస్తున్నాయని విమర్శించారు. గురుకులాల్లో చదువుకుని ఎంతో ఎత్తుకు ఎదిగిన విద్యార్థులు.. నేడు ఆకలి బాధతతో అల్లాడిపోతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి స్పందిస్తూ.. ‘‘అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా ! కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా ! దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలికేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపాం. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్రా అని ఆకలికేకలా ! పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకుని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు .. నేడు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా ! సిగ్గు సిగ్గు.. ఇది పాలకుల పాపం. విద్యార్థులకు శాపం. జాగో తెలంగాణ జాగో’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఆ ఘనత కాంగ్రెస్‌కే చెల్లింది.. హరీష్ విమర్శలు
మరోవైపు మాజీ మంత్రి హరీష్‌రావు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పేదరిక నిర్మూలన సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఆరు నెలలుగా జీతాలు రాక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని.. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మిన్నకుండా ఉండటంపై మాజీ మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తాం అంటూ డబ్బా కొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులకు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం శోచనీయమన్నారు.
మరో వివాదంలో మోహన్ బాబు సిబ్బంది
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 6000 మంది ఆర్పీలకు ఆరు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం సిగ్గుచేటన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అయినా ఆర్పిల పెండింగ్ జీతాలను చెల్లించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Ration Rice Case: దూకుడు పెంచిన పోలీసులు..
Read Latest Telangana News And Telugu News