Talasani: కవిత పర్మినెంట్‌గా జైల్‌లో ఉండాలా?...తలసాని ఆగ్రహం
ABN , Publish Date - Aug 27 , 2024 | 04:15 PM
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదు నెలలుగా తీహాడ్ జైలులో ఉన్న కవిత.. సుప్రీం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలకానున్నారు. కవితకు సుప్రీం బెయిల్ మంజూరు చేయడంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ...కవితకు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 27: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liqour Scam) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదు నెలలుగా తీహాడ్ జైలులో ఉన్న కవిత.. సుప్రీం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలకానున్నారు. కవితకు సుప్రీం బెయిల్ మంజూరు చేయడంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మాట్లాడుతూ...కవితకు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఇది మోటివేటెడ్ కేసని స్పష్టత వచ్చిందన్నారు.
Kavitha: కవిత తిహాడ్ జైలులో ఉన్నప్పుడు ఏం జరిగింది..!?
11మందిని అప్రువర్స్‌గా మార్చారన్నారు. వందల కోట్ల కేసని చెప్పి ఒక్క రూపాయి రికవరి చేయలేదని జడ్జిలే స్పష్టంగా చెప్పారన్నారు. బెయిల్ వచ్చిన తర్వాత కొందరు చేస్తున్న కామెంట్స్ మంచిది కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. బాధ్యతగల వ్యక్తులు మాట్లాడటం మంచిదికాదన్నారు. కేసులో ఉన్నవారందరికీ బెయిల్ వచ్చిందని.. కవితకు ఎలా బెయిల్ వచ్చింది అనడం హాస్యాస్పదమన్నారు. అంటే కవిత పర్మనెంట్‌గా జైల్‌లో ఉండాలా? అంటూ మండిపడ్డారు. న్యాయమూర్తులను అవమానించేలా మాట్లాడటం బాధాకరమని తలసాని శ్రీనివాస్ అన్నారు.
సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు: దాసోజు
దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈడీ ,సీబీఐల దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించాయని.. వారి వ్యాఖ్యలతో ఈ కేసు నిలవదని స్పష్టమైందన్నారు. కవిత ఓ ఫైటర్ అని చెప్పుకొచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక పార్టీ బలోపేతం కోసం ఆమె పోరాటం కొనసాగుతుందన్నారు. బీజేపీతో పొత్తులో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు వాదనకు నిలవవన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామి అని..ఆ పార్టీ నేత సిసోడియాకు ఇదే కేసులో బెయిల్ వస్తే కాంగ్రెస్ స్వాగతించి కవిత విషయం వచ్చే సరికి వేరే విధంగా మాట్లాడటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీ ఆప్ కుమ్మక్కయినట్టాఅని ప్రశ్నించారు. తప్పుడు వాదనలతో కాంగ్రెస్ ప్రజల్లో మరింత పలుచన కావొద్దని హితవుపలికారు.బీఆర్‌ఎస్‌కు బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని దాసోజు శ్రవణ్ మరోసారి స్పష్టంచేశారు.
ఇవి కూడా చదవండి..
Thummala: రుణమాఫీపై రైతుల ఆందోళన.. అపోహ పడొద్దన్న మంత్రి తుమ్మల
Kaleshwaram: కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ
Read Latest Telangana News and Telugu News