Harish Rao: హమీలు అమలు చేయలేకే రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు: హరీశ్ రావు..
ABN , Publish Date - Dec 20 , 2024 | 08:17 PM
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు వ్యవహారం తెలంగాణలో పెద్దఎత్తున రాజకీయ దుమారం లేపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వారం రోజులపాటు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ తీర్పు చెప్పింది.
హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు వ్యవహారం తెలంగాణలో పెద్దఎత్తున రాజకీయ దుమారం లేపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వారం రోజులపాటు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్‌పై పెట్టింది డొల్ల కేసని తేలిపోయిందని ఆయన అన్నారు. తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారని చెప్పారు. హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి అబద్ధాలకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. "పార్ములా-ఈ కార్ రేస్‌పై అసెంబ్లీలో చర్చ జరపాలని మేము అడిగాం. అన్ని విషయాలూ ప్రజలకు తెలియాలనే అడిగాం. మమ్మల్ని బయటకి పంపి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేస్ వల్ల రూ.600 కోట్ల నష్టమని ముఖ్యమంత్రి అసత్య ప్రచారం చేశారు. దాన కిషోర్‌కి రాసిన లేఖలో 50 శాతం ఫండ్స్ చెల్లించలేకపోవడంతో అగ్రిమెంట్ రద్దు చేసుకున్నట్లు ఉంది. రూ.47 కోట్లు కట్టనందుకు రద్దు చేసుకున్నామని కంపెనీ చెప్పింది. రూ.600 కోట్ల నష్టం కాదు.. లాభం జరిగింది. ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్‌కు రూ.600 నుంచి రూ.700 కోట్ల లాభం జరిగిందని నెల్సన్ అనే సంస్థ చెప్పింది.
అవినీతి ఎక్కడ జరిగింది?. ప్రొసీజర్ ల్యాప్స్ జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రొసీజర్ ల్యాప్స్ జరిగి ఉంటే ఉండొచ్చు. 192 దేశాల వాళ్లు ఈ రేస్‌ని తిలకించారు. రేస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. అవినీతి జరగనప్పుడు ఏసీబీ కేసు ఎలా నమోదు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారనే కేసులు పెట్టి బదనాం చేయాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హామీలు ఎలా అమలు చేయాలో అర్థంకాక ఇలా జిమ్మిక్కులు చేస్తున్నారు. లేని దివాళాని పదే పదే చెప్పి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏడాదిలో ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. రేవంత్ రెడ్డి కుటుంబం స్కామ్‌లను కేటీఆర్ బయటపెట్టారు. కేటీఆర్ చేసిన తప్పు ఏంటి?. హైదరాబాద్‌ని అభివృద్ధి చేయడమా?" అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
High court: ఫార్ములా- ఈ కార్ రేసు.. హైకోర్టు సంచలన తీర్పు..
TG highcourt: కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ...