Share News

GHMC: జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేతతో చర్యలు

ABN , Publish Date - Jun 16 , 2024 | 03:01 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు గల అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చి వేశారు. అవి అక్రమ నిర్మాణాలు అని చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే ఆదేశాలతో కూల్చివేత ప్రక్రియ జరిగింది. వాస్తవానికి హేమంత్‌కు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. తెలంగాణకు చెందిన ఓ మంత్రి స్వయంగా హేమంత్‌కు ఆదేశాలు ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది.

GHMC: జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేతతో చర్యలు
YS Jagan

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఇంటి ముందు గల అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చి వేశారు. అవి అక్రమ నిర్మాణాలు అని చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే ఆదేశాలతో కూల్చివేత ప్రక్రియ జరిగింది. వాస్తవానికి హేమంత్‌కు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. తెలంగాణకు చెందిన ఓ మంత్రి స్వయంగా హేమంత్‌కు ఆదేశాలు ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. దాంతో హేమంత్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. ఏపీలో వైసీపీ ఓడిపోయిన వెంటనే ఘటన జరగడంతో చర్చకు దారితీసింది.


ఆరా తీస్తే...

జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేత అంశం తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరిగింది. ఏం జరిగిందా అని ఆరాతీశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గ్రేటర్ కమిషనర్ ఆమ్రపాలి స్వయంగా రంగంలోకి దిగారు. కూల్చివేతల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయలేదని తెలిసింది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే సొంతంగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పై అధికారులకు హేమంత్ రిపోర్ట్ చేస్తే బాగుండేది. చెప్పకపోవడంతో హేమంత్‌ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పదవి నుంచి బదిలీ చేశారు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీచేశారు.


బదిలీ వేటు..!!

హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఏపీ మాజీ సీఎం జగన్‌ ఇంటి ముందు గల అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం సర్వత్రా చర్చకు దారితీసింది. బల్దియా అధికారులు కూల్చివేయడం చర్చానీయాంశమైంది. విషయం ఆరా తీస్తే.. జోనల్ కమిషనర్ సొంత నిర్ణయమని తెలిసింది. వెంటనే అతనిపై చర్యలు తీసుకున్నారు.

ఇది కూడా చదవండి:

AP Politics: వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి: మంత్రి సత్యకుమార్

Updated Date - Jun 16 , 2024 | 03:01 PM