Share News

GHMC: కమిషనరమ్మ.. తాళం వైపు చూడమ్మ

ABN , Publish Date - Oct 04 , 2024 | 07:46 PM

ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాలకు ముందు చూపు లేక పోవడంతో.. ప్రజలు పడుతున్న అవస్థలన్నీ ఇన్నీ కావు. గద్దెనెక్కిన పాలకా గణం.. ప్రజా సంక్షేమం కోసం అంటూ తీసుకుంటున్న పలు నిర్ణయాలు అభాసుపాలవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న నగదు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.

GHMC: కమిషనరమ్మ.. తాళం వైపు చూడమ్మ

ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాలకు ముందు చూపు లేక పోవడంతో.. ప్రజలు పడుతున్న అవస్థలన్నీ ఇన్నీ కావు. గద్దెనెక్కిన పాలకా గణం.. ప్రజా సంక్షేమం కోసం అంటూ తీసుకుంటున్న పలు నిర్ణయాలు అభాసుపాలవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న నగదు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందుకు అత్యుత్తమ ఉదాహరణ విశ్వ నగరం హైదరాబాద్. గద్దెనెక్కే వరకు విశ్వనగరాన్ని న్యూయార్క్ చేస్తాం, డల్లాస్ చేస్తాం, సింగపూర్ చేస్తాం, మారిషస్ చేస్తామంటూ వివిధ రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల వేళ.. పలు ప్రకటనల ద్వారా ఉదరగొడుతున్నారు. ఇక ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. ప్రచారంలో గుంపగుత్తగా ఇచ్చిన హామీలను నేతలు గాలికొదిలేస్తున్నారన్నది సుస్పష్టం.

GHMC01.jpg


విశ్వనగరంలో హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్ల పరిధిలో మహిళల కోసం కోట్లాది రూపాయిల ప్రజా ధనం వెచ్చించి మరుగుదొడ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది. అయితే ఆ మరుగుదొడ్లకు ప్రస్తుతం తాళాలు దర్శనమిస్తున్నాయి. దీంతో నగరంలో మహిళలు కోసం కోట్లాది రూపాయిల ప్రజా ధనాన్ని వినియోగించి నిర్మించిన మరుగుదొడ్లకు ప్రస్తుతం తాళమనే గ్రహణం పట్టిందని సగటు నగర జీవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

GHMC02.jpg


ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా గత ప్రభుత్వ పాలకులు అయితేనేమీ, ప్రస్తుత పాలకులు అయితేనేమీ.. వివిధ పథకాలను ఉచితాల పేరుతో పప్పు బెల్లాల్లాగా పంచి పెడుతున్నారు. అందుకు గత ప్రభుత్వ హాయంలో ప్రస్తుత హయాంలో ఏ మాత్రం తీసుపోని పథకాలును అమలు చేస్తున్నారు. ఈ తరహా పథకాలతో ప్రభుత్వ ఖాజానా కాస్తా.. ఖాళీ ఖజానాగా దర్శనమిస్తుంది. దీంతో మెయింటెనెన్స్ చేసేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు.

GHMC03.jpg


ఇప్పటికే విశ్వనగరంలోని వివిధ ప్రాంతాల్లో వీధి దీపాలు సైతం వెలగడం లేదు. ఇంకా సోదాహరణా చెప్పాలంటే.. ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో రాత్రుళ్లు వీధి దీపాలు వెలగడం లేదంటూ కేంద్రమంత్రికి నగర వాసులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి.. అక్కడికే జీహెచ్ఎంసీ ఉన్నధికారులను పిలిపించి మాట్లాడారు. జీహెచ్ఎంసీ వద్ద నిధులు లేవని సదరు ఉన్నతాధికారులు.. కేంద్ర మంత్రికి స్పష్టం చేశారు. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాస్తా తడబడిన.. సదరు ప్రాంతంలో లైట్లు వెలగాలంటూ వారిని ఆదేశించారు.

ghmc000000.jpg


దీంతో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిందనే ఓ చర్చ అయితే తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. పార్టీల నేతలు గద్దెనెక్కేందుకు చూపించే ఊపు ఉత్సాహం.. ప్రజల కోసం.. ముఖ్యంగా మహిళల కోసం నిర్మించిన మరుగుదొడ్లకు వేసిన తాళల అంశాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని నగర జీవులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం వద్ద నిధులుంటే ఏమైనా చేయగలరు. కానీ నిధులే లేకుంటే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఏం చేస్తారులే అని సగటు నగర జీవి మాత్రం ఓ నిటూర్పు విడిచి ఊరుకుంటున్నాడు. అయితే జీహెచ్ఎంసీ కమిషనర్‌గా మహిళ అధికారి ఉన్నారు. ఆమె అయినా ఈ సమస్యపై దృష్టి పెడతారని నగర జీవి ఆశిస్తున్నాడు.

For Telangan News And Telugu News...

Updated Date - Oct 04 , 2024 | 08:58 PM