Teachers: టీచర్లకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
ABN , Publish Date - Jun 07 , 2024 | 07:31 PM
ప్రభుత్వ ఉపాధ్యాయులకు(Governement Teachers) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. పదవీ విరమణ 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. పండిట్, పీఈటీ అప్‌గ్రేడేషన్, మల్టీజోన్ 2లో హెచ్ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1లో స్కూల్ అసిస్టెంట్..
హైదరాబాద్, జూన్ 07: ప్రభుత్వ ఉపాధ్యాయులకు(Government Teachers) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. పదవీ విరమణ 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. పండిట్, పీఈటీ అప్‌గ్రేడేషన్, మల్టీజోన్ 2లో హెచ్ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌తో షెడ్యూల్ ప్రారంభం కానుంది. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ అయితే ప్రక్రియ ఆగిపోయిందో.. అక్కడి నుంచే మళ్లీ ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
అసలైన శుభవార్త..
టీచర్లకు అసలైన శుభవార్త మరొకటి చెప్పింది తెలంగాణ సర్కార్ అదేంటంటే.. టెట్‌తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గత ప్రభుత్వంలో ప్రమోషన్లకు టెట్ అర్హత తప్పనిసరి చేసింది. అయితే, ఇప్పుడు విధానానికి స్వస్తి చెప్పింది కాంగ్రెస్ సర్కార్. జూన్ 8వ తేదీ నుంచి ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మల్టీజోన్ 1లో ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బదిలీలు, పదోన్నతులు కల్పించనున్నారు. 15 రోజులు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మల్టీజోన్ 2లో ఈ నెల 8వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 23 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తికానుంది.