TS Assembly: ‘కాళోజీ’ కవితతో ప్రసంగాన్ని మొదలుపెట్టిన గవర్నర్
ABN , Publish Date - Feb 08 , 2024 | 11:58 AM
Telangana: తెలంగాణ అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగం కొనసాగుతోంది. కాలోజీ కవితతో తెలుగులో గవర్నర్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగం కొనసాగుతోంది. కాలోజీ కవితతో తెలుగులో గవర్నర్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారన్నారు. దీంతో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం వచ్చిందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామన్నారు. అర్హులైన వారికి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందన్నారు. త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. కచ్చితంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు.
ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైందని... దాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. యువతకు 2 లక్షల ఉద్యోగుల కల్పనపై దృష్టిపెట్టామన్నారు. ప్రజావాణిలో 1.8కోట్ల దరఖాస్తులు వచ్చాయన్నారు. రైతులు, యువత, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మౌలిక వసతులరంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తామన్నారు. గత సమావేశాల్లో ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని గవర్నర్ తమిళిసై వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...