Share News

Raja Narasimha: TGMSIDC అధికారులతో ఆ అంశాలపై మంత్రి రాజనర్సింహ సమీక్ష..

ABN , Publish Date - Jul 02 , 2024 | 09:09 PM

సీజనల్ వ్యాధులు, పాముకాటు నివారణ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో "తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్" (TGMSIDC) అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Raja Narasimha: TGMSIDC అధికారులతో ఆ అంశాలపై మంత్రి రాజనర్సింహ సమీక్ష..

హైదరాబాద్: సీజనల్ వ్యాధులు, పాముకాటు నివారణ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో(Government Hospitals) అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో "తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్" (TGMSIDC) అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు.


ఆస్పత్రుల రూట్ మ్యాప్ సిద్ధం చేయండి..

వాతావరణ మార్పుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మందులు అందుబాటులో ఉంచాలని టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావును మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. అలాగే వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనులకు వెళ్తారని, పాముకాటుకు గురయ్యే అవకాశం ఉన్నందున ముందస్తుగానే ఆస్పత్రుల్లో నివారణ ఔషధాలు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య సదుపాయాల కల్పనలో భాగంగా భౌగోళికంగా పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు ఎంత దూరంలో ఉన్నాయో(హెల్త్ ఫెసిలిటీస్ మ్యాపింగ్) రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, ఈడీ కౌటిల్య, చీఫ్ ఇంజినీర్ దేవేందర్ కుమార్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో విశాలాక్షి పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2024 | 09:09 PM