IMD: ఇవాళ భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల వాళ్లు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
ABN , Publish Date - May 17 , 2024 | 03:48 PM
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది.
హైదరాబాద్: ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది.
సంగారెడ్డి,మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, వనపర్తి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఐఎండీ 'ఎల్లో' అలర్ట్ జారీ చేసింది.
ద్రోణి ప్రభావంతో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది.
ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందునా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి....
Air India: రన్‌వేపై ట్రగ్ ట్రాక్టర్‌ను ఢీకొట్టిన విమానం.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Billionaires Index: వరల్డ్ సూపర్ రిచ్ జాబితాలో అంబానీ, అదానీ..ఇంకా ఎవరెవరు ఉన్నారంటే
BJP: మమతా.. మీ రేటెంత? అంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
Read Latest Telangana News And Telugu News