Share News

Heavy Rain: రాగల గంటలో భారీ వర్షం.. మరో గంటలో..!

ABN , Publish Date - Jun 30 , 2024 | 06:23 PM

భాగ్యనగరంలో ఒక్కసారిగా భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు( ఆదివారం) మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన పడుతోంది.

Heavy Rain: రాగల గంటలో భారీ వర్షం.. మరో గంటలో..!

హైదరాబాద్: భాగ్యనగరంలో ఒక్కసారిగా భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు( ఆదివారం) మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన కురుస్తోంది. నగరంలోని కూకట్‌పల్లి, ముసాపేట్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్‌, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, ముసరాంబాగ్, మలక్‌పేట్, కోఠి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, లక్డీకపూల్, మెహదీపట్నం, టోలిచౌకి, షేక్ పేట్ భారీ వర్షం పడుతోంది.

అయితే రాగల గంట పాటు నగరానికి భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. అనవసరంగా ఎవ్వరు ఇంట్లో నుంచి బయటకు రావద్దని GHMC హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. వర్షం దంచికొడుతుంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.


MAYAOR.jpg

వర్షం ధాటికి చాలా చోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం నెలకొంది. గోల్కొండ, షేక్ పేట్, ఓయూ కాలనీ, రాయదుర్గంలో కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటన్నరగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకట్లో పలు కాలనీలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరించింది. అయితే జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అత్యవసరమైతే ఈ టోల్ ఫ్రీ నెంబర్ సంప్రదించాలని GHMC .. 040-21111111, 9000113667 కోరారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Jun 30 , 2024 | 09:19 PM