Hyderabad Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలుచోట్ల భారీ వర్షం..
ABN , Publish Date - May 07 , 2024 | 06:02 PM
Heavy Rain in Hyderabad: తెలంగాణ(Telangana) రాజధాని హైదరాబాద్‌లో(Hyderabad) ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా వాతావరణం(Weather) చల్లబడింది. భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. కూకట్‌పల్లి, KPHB, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బాలానగర్, ఫతేనగర్, సనత్ నగర్‌లోనూ..
Heavy Rain in Hyderabad: తెలంగాణ(Telangana) రాజధాని హైదరాబాద్‌లో(Hyderabad) ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా వాతావరణం(Weather) చల్లబడింది. భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. కూకట్‌పల్లి, KPHB, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బాలానగర్, ఫతేనగర్, సనత్ నగర్‌లోనూ వర్షం పడుతోంది. జీడిమెట్ల, చింతల్, షాపూర్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్‌లో ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నాయి. అదే సమయంలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా చెట్లు, హోర్డింగ్స్ నేలకూలుతున్నాయి. కోఠి, అబిడ్స్, గోషామహల్, ఎంజే మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
జిల్లాల్లోనూ భారీ వర్షం..
హైదరాబాద్‌లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ టూర్ క్యాన్సిల్ అయ్యింది. ఇక మెదక్ పట్టణంలోనూ పలు చోట్ల వర్షం కురుస్తోంది. వడగళ్ల వాన పడుతోంది. కొమరం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో బెజ్జూరు చింతలమానెపల్లి, కౌటాల మండలాలలో వడగళ్ల వర్షం పడుతోంది. వరంగల్‌లోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నల్లటి మేఘాలు దట్టంగా కమ్మేశాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోనూ ఈదురు గాలులలో కూడిన వర్షం కురుస్తోంది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
పెద్దపల్లి జిల్లా మంథనిలో బీజేపీ జనగర్జన సభలో గాలి దుమారానికి టెంట్లు కూలిపోయాయి. ఓ ఎస్ఐకి స్వల్ప గాయాలు అయ్యాయి. భయాందోళనతో ప్రజలు, బీజేపీ నేతలు సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. సిరిసిల్లలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. జగిత్యాలలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. హుజురాబాద్‌లోనూ ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.
ఆందోళనలో రైతాంగం..
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. వర్షం కారణంగా రైతులు ఆందోళనలో ఉన్నారు. తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకకు తరలించారు. ఐకేపీ కేంద్రాల్లో ధన్యాన్ని రాశులుగా పోసి ఉంచారు. చాలా చోట్ల ఇంకా ధాన్యం కొనుగోళ్లు పూర్తవలేదు. ఇప్పుడు వర్షం పడుతుండటంతో.. చేతికందిన పంట నీళ్ల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.