Traffic Alert: హైదరాబాద్‌లో ఆ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్..
ABN , Publish Date - Dec 25 , 2024 | 05:52 PM
భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొండాపూర్‌లో ఏఎంబీ మాల్ రూట్‌లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రోడ్డంతా వాహనాలతో నిండిపోయింది. దీంతో వాహనదారులు...
హైదరాబాద్, డిసెంబర్ 25: భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొండాపూర్‌లో ఏఎంబీ మాల్ రూట్‌లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రోడ్డంతా వాహనాలతో నిండిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూట్ క్లియర్ అవడానికి చాలా సమయం పడుతుంది. ఉద్యోగులు తమ విధుల నుంచి తిరుగుపయనం అవడంతో పాటు.. ఆ రూట్‌లో చిరుజల్లులు కురుస్తుండటంతో.. ట్రాఫిక్ జామ్ అయ్యింది. సాధారణంగానే ఈ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. కానీ, ఇవాళ మరింత ట్రాఫిక్ జామ్ ఉండటం, రూట్ క్లియర్ అవడానికి చాలా సమయం పడుతుండటంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు..
నగరంలో ముఖ్యంగా కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఈ ట్రాఫిక్ సమస్యలు తొలగించేందుకు జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే నగరంలో చాలా చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించగా.. మరికొన్ని ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అవి కూడా పూర్తయితే.. ఈ ట్రాఫిక్ కష్టాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే, వాహనదారులు సైతం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణిస్తే.. ట్రాఫిక్ జామ్ అవకుండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
Also Read:
అల్లు అర్జున్ జాతకంపై వేణు స్వామి కామెంట్స్
కెన్-బెత్వా నధుల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు..
For More Telangana News and Telugu News..