Share News

BREAKING: భాగ్యనగరంలో వరుసగా భారీ అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు

ABN , Publish Date - Dec 19 , 2024 | 08:45 AM

భాగ్యనగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. గురువారం సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

 BREAKING:  భాగ్యనగరంలో వరుసగా భారీ అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఇవాళ(గురువారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. మోండా మార్కెట్ పూజ సామాగ్రి దుకాణంలో మంటలు దట్టంగా వ్యాపించాయి. వెనువెంటనే నాలుగు దుకాణాల్లో మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను సిబ్బంది ఆర్పివేశారు. పూజ సామాగ్రి దుకాణంతోపాటు ప్లాస్టిక్ దుకాణంలో మంటలు వ్యాపించాయి. భారీ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పక్క షాపులను కూడా పోలీసులు మూసేయిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


భాగ్యనగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం సంబంధిత అధికారులకు పరిపాటిగా మారింది. మళ్లీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారుల్లో చలనం వస్తుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో సికింద్రాబాద్‌లో నాలుగు పెద్ద అగ్నిప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే.


పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐఎస్ సదన్ పీఎస్ పరిధిలో ఉన్న మాదన్నపేట చౌరస్తాలో ఓ స్క్రాప్ గోదాంలో మంటలు అంటుకున్నాయి. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.


భారీ అగ్నిప్రమాదంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. మూడు నుంచి ఐదు ఫైర్ ఇంజన్లను సంఘటన స్థలానికి పిలిపించి మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. పరిశ్రమలోని వస్తువులు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth Reddy: అదానీకి ప్రధాని అండ

AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్‌.. హైడ్రా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు తర్వాత చర్యలు

Hyderabad: అనుమతి నుంచి రెన్యూవల్‌ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 19 , 2024 | 08:53 AM