Weather: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. బయటకు రాగానే నగరవాసికి ఊహించని అనుభవం..
ABN , Publish Date - Dec 25 , 2024 | 09:52 AM
ఈరోజు అసలే హాలిడే దీంతో వేతనజీవి కాస్త ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకుందామని కొందరు అనుకుంటే.. ఏవైనా పనులు ఉంటే చూసుకుందామనుకుంటారు మరికొందరు. ఇలా సిటీ లైఫ్‌లో ఎవరి బిజీలో వారుంటారు. ఈ కాలంలో బయటకు రాగానే చలి ఎక్కువుగా ఉంటుందని ఫిక్స్ అయి స్వెటర్, మంకీ క్యాప్ పెట్టుకుని బయటకు వచ్చిన నగర వాసికి ఊహించని అనుభవం ..
చలికాలంలో ఉదయం లేవగానే చలి ఎక్కువుగా ఉంటుందని అంతా ఊహిస్తారు. చలికాలంలో ఉదయం లేవడానికి నగరవాసులు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ రోజూ వాకింగ్‌కు వెళ్లే వాళ్లు కాలంతో సంబంధం లేకుండా ఉదయమే లేస్తుంటారు. ఈరోజు అసలే హాలిడే దీంతో వేతనజీవి కాస్త ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకుందామని కొందరు అనుకుంటే.. ఏవైనా పనులు ఉంటే చూసుకుందామనుకుంటారు మరికొందరు. ఇలా సిటీ లైఫ్‌లో ఎవరి బిజీలో వారుంటారు. ఈ కాలంలో బయటకు రాగానే చలి ఎక్కువుగా ఉంటుందని ఫిక్స్ అయి స్వెటర్, మంకీ క్యాప్ పెట్టుకుని బయటకు వచ్చిన నగర వాసికి ఊహించని అనుభవం ఎదురైంది. కొంచెం చలి.. అదే సమయంలో చల్లటి జడి వానలు నగర వాసిని పలకరించాయి.
మంగళవారం రాత్రి నుంచి ఒక్కసారిగా హైదరాబాద్‌లో వాతావరణం మారిపోయింది. చలి తీవ్రత ఈనెల మొదటి వారంతో పోల్చినప్పుడు కొంచెం తగ్గినట్లు అనిపించినా.. ఈ చలిలో జడివానలు పడుతూ వాతావరణంలో మార్పు కనిపించింది. సాధారణంగా సంక్రాంతి తర్వాత చలి తీవ్రత తగ్గి.. వాతావరణంలో మార్పు మొదలవుతుంది. డిసెంబర్ నెలఖారుకు చలి ఎక్కువుగానే ఉంటుంది. సడన్‌గా ఈరోజు వెదర్ ఛేంజ్ కావడంతో నగర వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోనే ఈ రకంగా వాతావరణం మారి ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలోనే ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది మరింత బలపడిందని, సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల వరకు మేఘాలను కలిగిఉందన్నారు. ఈ అల్పపడీనం నైరుతి వైపుగా కదులుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రానున్న 24 గంటల్లో ఇది బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మంగళవారం రాత్రి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న రెండు, మూడు రోజులు తెలంగాణలో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Readmore Latest Telugu News Click Here