Hyderabad: ఇలా ఉన్నారేంట్రా బాబూ.. డబ్బులు కొట్టేసేందుకు ఏం చేశారో తెలుసా?
ABN , Publish Date - Apr 05 , 2024 | 01:35 PM
ఏటీఎం మిషన్‌లో(ATM) ఇనుప ముక్కులను అడ్డుపెట్టి వినియోగదారుల డబ్బులు కాజేస్తున్న ఇద్దరిని రెయిన్ బజార్ పోలీసులు(TS Police) అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హరియాణ రాష్ట్రం నూహ్ జిల్లాకు చెందిన తారిఖ్‌ఖాన్(27)మెకానిక్. తాలేబ్ హుస్సేన్ అలియాస్ సమీర్‌ఖాన్(34) ప్రైవేట్ ఉద్యోగి, బోరబండలో నివాసం ఉంటున్న..
హైదరాబాద్, ఏప్రిల్ 05: ఏటీఎం మిషన్‌లో(ATM) ఇనుప ముక్కులను అడ్డుపెట్టి వినియోగదారుల డబ్బులు కాజేస్తున్న ఇద్దరిని రెయిన్ బజార్ పోలీసులు(TS Police) అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హరియాణ రాష్ట్రం నూహ్ జిల్లాకు చెందిన తారిఖ్‌ఖాన్(27)మెకానిక్. తాలేబ్ హుస్సేన్ అలియాస్ సమీర్‌ఖాన్(34) ప్రైవేట్ ఉద్యోగి, బోరబండలో నివాసం ఉంటున్న ఇద్దరూ ఏటీఎం విషన్‌లో డబ్బు కాజేయాలని పథకం వేశారు. ఏటీఎం మిషన్‌లో డబ్బు బయటకు వచ్చే ప్రాంతంలో ఇనుప ముక్కలు అడ్డుపెట్టి సమీపంలో ఉండేవారు.
ఏటీఎం సెంటర్‌కు వచ్చిన వినియోదారులు కార్డు పెట్టి డబ్బుడ్రా చేసుకోవడానికి యత్నించగా, వారి అకౌంట్‌లో డబ్బు కట్ అయినట్టు మేసేజ్ వస్తున్నది, కానీ డబ్బు మాత్రం రావడంలేదు. వారు బయటకు వెళ్లిపోగానే వారిద్దరు ఏటీఎంలోకి ప్రవేశించి ఇనుప వస్తువును తొలగించి ఇరుక్కున్న నోట్లను తీసుకుని వెళ్లిపోతున్నారు. ఈనెల 1న బాధితుడు రైన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఇవి కూడా చదవండి:
కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగాస్త్రాలు..
చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రఘురామకృష్ణం రాజు..!