Share News

PC Ghosh Commission: ఐఏఎస్‌లను ప్రశ్నించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌..

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:19 PM

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఇవాళ( సోమవారం) దాదాపు 10మంది ఐఏఎస్‌లను విచారించింది. కమిషన్ ఎదుట స్మితా సబర్వాల్, రజత్ కుమార్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, రాహుల్ బొజ్జా, ఎస్.కె.జోషి, కంచర్ల రఘు హాజరయ్యారు. ఇందులో పలువురు తాజా, మాజీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఉన్నారు.

PC Ghosh Commission: ఐఏఎస్‌లను ప్రశ్నించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌..

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఇవాళ( సోమవారం) దాదాపు 10మంది ఐఏఎస్‌లను విచారించింది. కమిషన్ ఎదుట స్మితా సబర్వాల్, రజత్ కుమార్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, రాహుల్ బొజ్జా, ఎస్.కె.జోషి, కంచర్ల రఘు హాజరయ్యారు. ఇందులో పలువురు తాజా, మాజీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక నిర్ణయాలు, అమలు చేసిన విధానాలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ వారిని ప్రశ్నించింది. నిర్మాణ లోపాలపై కీలక ప్రశ్నలను చంద్రఘోష్ కమిషన్ వారికి సంధించింది. దీనిపై ఐఏఎస్ అధికారులు వివరణ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులపై తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరు తదితర వివరాలను కమిషన్‌కు వివరించారు.


అనంతరం ఇప్పటివరకు చెప్పిన వివరాలను అఫిడవిట్ రూపంలో వారం రోజుల్లోగా సమర్పించాలని కమిషన్ ఆదేశించగా.. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లు చెప్పారు. అయితే తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మరింత గడువు కావాలని ప్రస్తుత ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కోరారు. దీంతో ఆగస్టు 5లోపు అఫిడవిట్ సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. విచారణకు స్మితా సబర్వాల్, రజత్ కుమార్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, రాహుల్ బొజ్జా, కంచర్ల రఘు ప్రత్యక్షంగా హాజరు కాగా.. ఎస్.కె.జోషి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సైతం ఇవాళ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఎదుట హాజరుకానున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 04:20 PM