Kadiyam Srihari: ఎన్నికలప్పుడు పార్టీలు మారడం సహజమే..
ABN , Publish Date - Mar 07 , 2024 | 01:29 PM
బీఆర్ఎస్‌ను బూచీగా చూపించి మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడమని హెచ్చరించారు. మాకు ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన లేదన్నారు. ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని కడియం శ్రీహరి సూచించారు.
హనుమకొండ : బీఆర్ఎస్ (BRS)ను బూచీగా చూపించి మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడమని హెచ్చరించారు. మాకు ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన లేదన్నారు. ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని కడియం శ్రీహరి సూచించారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్య, కరెంటు సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉందని.. దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. అధికార పార్టీ కేసులకు భయపడి కొందరు తొందరపడి పార్టీ మారుతున్నారన్నారు. ఎన్నికలప్పుడు పార్టీలు మారడం సహజమేనన్నారు. కడియం శ్రీహరి ఎవరి గురించి టికెట్ అడగరని.. అందరితో తనను జత కట్టవద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని కడియం శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు.
Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.