Share News

TS Govt: పశుసంవర్థక శాఖ కేసులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Jan 16 , 2024 | 02:15 PM

Telangana: పశుసంవర్థక శాఖ కేసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. పశుసంవర్థక శాఖకు సంబంధించిన కేసులు ఏసీబీకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

TS Govt: పశుసంవర్థక శాఖ కేసులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

హైదరాబాద్, జనవరి 16: పశుసంవర్థక శాఖ కేసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (Telangana Governemt) కీలక నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. పశుసంవర్థక శాఖకు సంబంధించిన కేసులు ఏసీబీకి (ACB) బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గొర్రెల పంపిణీ వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి పశసంవర్థక శాఖపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అలాగే పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపైనా కేసు ఫైల్ అయ్యింది. ఈ రెండు కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి గచ్చిబౌలిలో ఇప్పటికే అధికారులపై కేసు నమోదు అయ్యింది. అలాగే నాంపల్లిలోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయంపై కేసు నమోదు అయ్యింది.


గొర్రెల పంపిణీ కేసులో కీలక అంశాలు

మరోవైపు గొర్రెల పంపిణీ కేసులో కీలక అంశాలు వెలగులోకి వచ్చాయి. గొర్రెల పంపిణీపై డిసెంబర్ 26న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు అందింది. సన్నిబోయిన ఏడుకొండలు అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది ఆగస్టు 13 నుంచి 23 తేదీలలో పశుసంవర్ధన్ శాఖ అధికారులు ప్రకాశం జిల్లాకు వెళ్లారు. కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రమ్‌తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవ సాయి ఏపీకి వెళ్ళారు. ఈ క్రమంలో 133 గొర్రెల యూనిట్లను అధికారులకు రైతులు అందజేశారు. ఒక్కో యూనిట్లో 21 గొర్రెలు ఉన్నాయి. అనంతరం గొర్రెలు ఇచ్చిన 18 మంది రైతుల బ్యాంకు వివరాలను పశు సంవర్ధన అధికారులు తీసుకున్నారు.

అయితే గొర్రెలు పంపిణీ చేసిన 18 మంది రైతులకు ఇప్పటి వరకు పశుసంవర్థక శాఖ ఒక్కరూపాయి కూడా చెల్లించని పరిస్థితి. ఏపీ రైతులకు బదులు బినామీ అకౌంట్ నంబర్లకు గత ప్రభుత్వ అధికారులు నగదు బదిలీ చేయండం సంచలనంగా మారింది. రైతులు వెళ్లి కాంట్రాక్టర్‌ను డబ్బులు అడగగ్గా అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో రైతు ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్లతో పాటు, పశుసంవర్ధన్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిపై 406,409,420 ఐపీసీ సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 16 , 2024 | 02:19 PM