BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం నేడు..
ABN , Publish Date - Oct 16 , 2024 | 08:11 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంలకు గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా మూసీ సుందరీకరణ, హైడ్రాపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించనున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి (Ex Minister), ఎమ్మెల్యే కేటీఆర్ (MLA KTR) అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంలకు గ్రేటర్ హైదరాబాద్ (Grarter Hyderabad) బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) కీలక సమావేశం (Key Meeting)జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా మూసీ సుందరీకరణ, హైడ్రాపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. అనంతరం మూసీ, హైడ్రాపై భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు. బాధితుల తరుపున ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ సెల్ కోర్టుల్లో కేసులు వేసింది. ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే.. బాధితులతో కలసి ప్రత్యక్ష పోరటాం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
కాగా మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు..
ప్రస్తుతం తెలంగాణలో మూసీ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై అధికార కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో భారీ దోపిడీకి కుట్ర చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై సీరియస్ అయిన కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూసీ ప్రాజెక్టులో రూ. 1.50 లక్షల కోట్ల స్కామ్ జరుగుతోందని.. ఇందులో రూ. 25 వేల కోట్లు ఢిల్లీకి పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. ప్రజా సొమ్మును లూటీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే.. ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ పీఎస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారామె. కేటీఆర్ ఆరోపణలకు సంబంధించిన విజువల్స్‌ని పోలీసులకు అందజేశారు. వీటి ఆధారంగా ఉట్నూర్ పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.
కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి అన్నీ రంగాలు కుదేలయ్యాయని బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అన్నారు. వ్యవసాయ, విద్యా, విద్యుత్ రంగాలు అధ్వానంగా మారాయని బీర్ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గురుకులాల బిల్డింగులకు కనీసం అద్దె చెల్లించలేక విద్యార్థులను రోడ్డుపైకి తెచ్చారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ ట్వీట్ ఇదే..
"బడా భాయ్ (ప్రధాని మోదీ) రాష్ట్రంలో పత్తి రైతులకు పట్టాభిషేకం జరుగుతుంటే చోటా భాయ్ (రేవంత్ రెడ్డి) పాలనలో మాత్రం పత్తి రైతులు చిత్తు అయ్యారు. గుజరాత్‌లో మద్దతు ధరకు మించి క్వింటా పత్తి ధర రూ.8,257 పలుకుతోంది. కానీ తెలంగాణలో క్వింటా ధర కేవలం రూ.5వేలేనా.. రెండేళ్ల కిందట పత్తి క్వింటా ధర రూ.10 నుంచి రూ. 15 వేల వరకూ పలికింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి మారింది. మార్కెట్‌కు దిగుబడి వచ్చినా సీసీఐ కేంద్రాలెక్కడ.. ఇందిరమ్మ రాజ్యమని దళారుల రాజ్యం తెస్తారా.. నిన్న పెట్టుబడి సాయం అందించలేదు, నేడు కష్టించి పండించినా పంట కొనుగోలు చేయరా.. పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతోంది. ముందుచూపు లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే పత్రి రైతులకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతోంది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వాయుగుండంగా బలపడిన అల్పపీడనం..
రీల్ లైఫ్ ప్రేమికులు.. రియల్ లైఫ్ దంపతులు..
మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News