Kishan Reddy: మోదీ తీసుకొచ్చిన నూతన విప్లవం ఇదే..
ABN , Publish Date - Jan 29 , 2024 | 07:20 PM
పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య(Gaddam Sammaiah)ను కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సన్మానించారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక పీపుల్స్ పద్మా అవార్డులు ఇస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య(Gaddam Sammaiah)ను కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక పీపుల్స్ పద్మా అవార్డులు ఇస్తున్నారని తెలిపారు. గతంలో పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నవారికే పద్మశ్రీ అవార్డులు వచ్చేవని అన్నారు. మొగిలయ్యాకు, మల్లేశం, సమ్మయ్య లాంటి వారికి పద్మా అవార్డులు వచ్చాయని తెలిపారు. యక్షగానం చేస్తున్న సమ్మయ్యకు ప్రధాని నరేంద్రమోదీ గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు.
నరేంద్రమోదీ తీసుకొచ్చిన నూతన విప్లవం ఇదని చెప్పారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య మాట్లాడుతూ.. సినిమాలను తట్టుకొని కళను బతికిస్తున్నామని తెలిపారు. పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 5 రోజుల పాటు రామాయణ నాటకం వేసినట్లు తెలిపారు. అయోధ్య నుంచి రాగానే తనకు ఈ అవార్డు వచ్చినట్లు ప్రకటన రావడం చాలా ఆనందంగా ఉందని గడ్డం సమ్మయ్య పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లంకల దీపాక్ రెడ్డికి గడ్డం సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.