Share News

KTR: కాంగ్రెస్ నేతలను ఆ విషయంలో విడిచిపెట్టం.. కేటీఆర్ మాస్ వార్నింగ్

ABN , Publish Date - Feb 27 , 2024 | 03:35 PM

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే విడిచే పెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో జనం నుంచి ఒక్కటే మాట వినిపిస్తోందని.. తప్పుదారి కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఓటేశామని జనం అనుకుంటున్నారని చెప్పారు.

KTR: కాంగ్రెస్ నేతలను ఆ విషయంలో విడిచిపెట్టం.. కేటీఆర్ మాస్ వార్నింగ్

హైదరాబాద్: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే విడిచే పెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) మాస్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం నాడు అంబర్‌పేట బీఆర్ఎస్ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ... రాష్ట్రంలో జనం నుంచి ఒక్కటే మాట వినిపిస్తోందని.. తప్పుదారి కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఓటేశామని జనం అనుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చూసి మోస పోయామని జనం చెబుతున్నారని అన్నారు. గ్రేటర్‌లో గోషామహల్ మినహా అన్ని తామే గెలిచామని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలను జనంలోకి తీసుకెళ్లాలని అన్నారు.

కాంగ్రెస్‌ నేతలు ఆ మాట చెబితే తన్నేవారు

కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికీ అన్నీ ఇస్తామని చెప్పి... ఇప్పుడు కొందరికే కొన్ని అంటున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కల్లబొల్లి కబుర్లు కట్టిపెట్టి జనం సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో18 ఏళ్లు నిండిన కోటి 67 లక్షల మంది మహిళలు ఉన్నారని.. అందరికి రూ. 2500 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి 17వ తేదీకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు నిండుతాయని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోతే బొంద పెడతామని హెచ్చరించారు. మార్పు అని ఓటేస్తే రేవంత్ ప్రభుత్వం తమ కడుపు కొట్టిందని ఆటో డ్రైవర్లు బాధ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోటి 37 లక్షల 50 వేల కరెంట్ మీటర్లు ఉన్నాయని.. వాళ్లలో కొంత మందికి మాత్రమే గృహజ్యోతి ఇస్తామని చెబుతున్నారని అన్నారు. ఇదే విషయం ఎన్నికల ముందు చెబితే కాంగ్రెస్‌ నేతలను తన్ని పంపేవారని మందలించారు. సికింద్రాబాద్ పార్లమెంట్‌పై గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 03:49 PM