BRS: ప్రజా సమ్యస్యల మీద పోరాడే ఫార్ములే కేటీఆర్: బాల్క సుమన్
ABN , Publish Date - Dec 13 , 2024 | 10:56 AM
ప్రశ్నించడమే నేరమా.. నిలదీయడమే పాపమా.. అని బాల్క సుమన్ అన్నారు. లగచర్ల, దిలావర్ పూర్, రైతుకు బేడీలు, విద్యార్థుల మరణాలు, గురుకుల సంక్షోభాలు.. ఇలా వీటన్నింటిపై కేటీఆర్ నిలదీస్తున్నందుకే కుట్రాలా అంటూ ఆయన ప్నశించారు.
హైదరాబాద్: ప్రజా సమ్యస్యల మీద పోరాడే పోరాట ఫార్ములే కేటీఆర్ (KTR) అని, రైతులపై సర్కారు దుర్మార్గాలను నిలదీసే ఫార్ములే కేటీఆర్ అంటూ బీఆర్ఎస్ నేత (BRS Leader) బాల్క సుమన్ (Balka Suman) సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా ట్వీట్ (Tweet) చేశారు. ‘‘ఆశా కార్యకర్తలైన, ఆడబిడ్డల మీద - గురుకుల పసిబిడ్డల ఫుడ్ పాయిజనింగ్ మీద స్పందించి సర్కార్ మెడలు వంచే ఫార్ములే కేటీఆర్.. తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న దాడులను ప్రశ్నించే ఫార్ములే కేటీఆర్ .. ఏడాదికాలంగా రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న మూర్ఖపు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆగడాలను, అన్యాయాలను నిలదీస్తున్న నాయకుడే మన కేటీఆర్.. ప్రభుత్వానికి మింగుడుపడని, కొరకరాని కొయ్యగా మారి, ప్రజలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కేటీఆర్ మీద సర్కారు కుట్రలు, కుతంత్రాలకు కొదవలేదంటూ..’’ బాల్క సుమాన్ ట్వీట్ చేశారు.
ప్రశ్నించడమే నేరమా.. నిలదీయడమే పాపమా.. అని బాల్క సుమన్ అన్నారు. లగచర్ల, దిలావర్ పూర్, రైతుకు బేడీలు, విద్యార్థుల మరణాలు, గురుకుల సంక్షోభాలు.. ఇలా వీటన్నింటిపై కేటీఆర్ నిలదీస్తున్నందుకే కుట్రాలా అంటూ ఆయన ప్నశించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, కిస్మత్ రెడ్డి అని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన వద్దకు వెళ్లి సన్మానం చేస్తారని.. ఈయన చేయించుకుంటారని బాల్క సుమాన్ విమర్శించారు. ప్రజలను అరిగోసపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతిస్తారని విమర్శించారు.
కాగా ‘‘కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీలో కుస్తీ అని.. తెలంగాణలో దోస్తీ.. మీ కుట్రలకు కుతంత్రాలకు మా నాయకుడు కేటీఆర్ అదరడు బెదరడు.. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాడు.. మీ అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలపై నిలదీస్తూనే ఉంటాడు.. జాగో తెలంగాణ జాగో’’ అంటూ బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govt.) తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. ‘‘భూమి ఇయ్యను అన్నందుకు గిరిజన రైతులను జైలులో పెట్టడం ఒకేనట.. జైలులో వారిని చిత్రహింసలు పెట్టడం ఒకేనట.. వారి కుటుంబసభ్యులను అర్ధరాత్రి ఇండ్ల మీద దాడిచేసి భయపెట్టడం, బెదిరించడం ఓకేనట.. నెల రోజులుగా వారికి చెయ్యని నేరానికి బెయిల్ కూడా రాకుండా అడ్డుపడటం ఒకేనట.. గుండె జబ్బుతో ఉన్న పేషెంటుకు బేడీలు వేయించటం కూడా ఒకేనట.. చేసే దరిద్రపు పనులు అన్ని రహస్యంగా చేయించి, ఇప్పుడు కెమెరాల ముందు దొరికిపోగానే అధికారులను బలిపశువులను చేస్తున్న రేవంత్ రెడ్డి, నీ నిజరూపం రాష్ట్రంలోని పేదలందరికి తెలిసిపోయింది.. ఇకనైనా క్షమాపణ చెప్పి కేసులు రద్దు చెయ్యి, రైతులను విడుదల చెయ్యి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..
హైదరాబాద్ బేగంబజార్‌లో దారుణం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News