Share News

Mallareddy: కష్టపడ్డా.. కళాశాలలు పెట్టినానంటూ డైలాగ్స్.. మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థుల వాస్తవ పరిస్థితేంటంటే..

ABN , Publish Date - Feb 08 , 2024 | 12:04 PM

‘కష్టపడ్డా.. పాలమ్మినా.. కళాశాలలు పెట్టినా’ అంటూ మీడియా ముందు మాజీ మంత్రి చేమకూర మల్లారెడ్డి భారీ భారీ డైలాగ్స్ చెబుతుంటారు. ఏదో ఫ్రీగా విద్యాదానం చేస్తున్నట్టుగా కబుర్లు చెబుతుంటారు.

Mallareddy: కష్టపడ్డా.. కళాశాలలు పెట్టినానంటూ డైలాగ్స్.. మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థుల వాస్తవ పరిస్థితేంటంటే..

హైదరాబాద్: ‘కష్టపడ్డా.. పాలమ్మినా.. కళాశాలలు పెట్టినా’ అంటూ మీడియా ముందు మాజీ మంత్రి చేమకూర మల్లారెడ్డి భారీ భారీ డైలాగ్స్ చెబుతుంటారు. ఏదో ఫ్రీగా విద్యాదానం చేస్తున్నట్టుగా కబుర్లు చెబుతుంటారు. కానీ వాస్తవానికి బోలెడంత ఫీజు కట్టి ఆయన కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు మాత్రం పురుగులతో కూడిన భోజనం పెడుతున్నారట. పురుగులు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదట. దీంతో విద్యార్థులు నేడు ఆందోళనకు దిగారు.

కుత్బుల్లాపూర్ మైసమ్మ గూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. గత కొద్ది రోజులుగా తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని చెబుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు సైతం విద్యార్థినులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నాయి. విద్యార్థినులు, విద్యార్థి సంఘాలపై చేయి చేసుకుని వారిని మల్లారెడ్డి కళాశాల సిబ్బంది చితకబాదింది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Feb 08 , 2024 | 12:04 PM