Mallareddy: కాలేజ్ వద్ద జరుగుతున్న నిరసనలపై స్పందించిన మల్లారెడ్డి
ABN , Publish Date - Feb 10 , 2024 | 12:55 PM
తన కాలేజ్ వద్ద నిరసనపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తాము ప్రతిరోజూ పది వేల మంది విద్యార్థులకు భోజనం వండుతామని వెల్లడించారు.
హైదరాబాద్: తన కాలేజ్ వద్ద నిరసనపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తాము ప్రతిరోజూ పది వేల మంది విద్యార్థులకు భోజనం వండుతామని వెల్లడించారు. ఒక పురుగొచ్చి చిన్న పొరపాటు జరిగిందని.. పొరపాటును సవరించుకుంటామన్నారు. మళ్లీ అలాంటి పొరపాటు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే అధికారులు వచ్చి ఫుడ్ శాంపిల్స్ తీసుకుని వెళ్లారన్నారు. కావాలని విద్యార్థి సంఘాలు ప్రతిరోజూ తన కాలేజ్ వద్ద ఆందోళన చేస్తున్నాయని మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే విద్యార్థులు మాత్రం చాలా రోజులుగా తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని.. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆందోళన చేస్తోంది.