Share News

Mohan Babu: రిపోర్టర్లపై దాడి చేసిన కలెక్షన్ కింగ్

ABN , Publish Date - Dec 10 , 2024 | 07:59 PM

మనోజ్ ను జల్ పల్లి ఫామ్ హౌస్ లోకి రానీయకుండా వాచ్ మెన్ గేటు మూసివేశారు. ఆ క్రమంలో మనోజ్ పై బౌన్సర్లు దాడి చేశారు. మోహన్ బాబు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఇన్సిడెంట్ కవర్ చేసే మీడియా ప్రతినిధులపై దాడి చేశారు.

Mohan Babu: రిపోర్టర్లపై దాడి చేసిన కలెక్షన్ కింగ్
Manchu Mohan Babu

హైదరాబాద్: మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. మొన్నటి నుంచి పూటకో ట్విస్ట్ నెలకొంటుంది. మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. గన్ మెన్ కావాలని ఇంటెలిజెన్స్ ఏడీజీని మనోజ్ కలిశారు. ఆ తర్వాత జల్ పల్లిలో గల ఇంటికొచ్చిన మనోజ్.. తన వస్తువులను వాహనంలో తీసుకొని వచ్చారు. మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి జల్ పల్లిలో గల ఫామ్ హౌస్ కు మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. అక్కడికి మోహన్ బాబు, విష్ణు కూడా వచ్చారు. మనోజ్ ను లోపలికి రానీయకుండా వాచ్ మెన్ గేటు మూసివేశారు. అక్కడ వాగ్వివాదం జరిగంది. మనోజ్ పై విష్ణు బౌన్సర్లు దాడి చేశారు. అక్కడికొచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇద్దరు రిపోర్టర్లపై దాడి చేశారు. మోహన్ బాబు దాడి చేస్తుండగా పోలీసులు అక్కడే ఉన్నారు. అయినప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.


మోహన్ బాబు దాడి చేసిన మీడియా ప్రతినిధి ఒక్కరు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. దాంతో జల్ పల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి చేయి దాటడంతో.. మోహన్ బాబు, విష్ణు గన్ లను ఉన్నతాధికారులు సీజ్ చేశారు.


మోహన్ బాబు వాయిస్ మెసేజ్

మరోవైపు మనోజ్‌కు మోహన్ బాబు వాయిస్ మెసేజ్ ఇచ్చారు. ‘మనోజ్ నువ్వు నా బిడ్డవు. నిన్ను ఎలా పెంచానురా నేను. అందరికంటే నిన్నే గారాభంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించా. నువ్వు ఎది అడిగినా ఇచ్చాను. నువ్వు ఈ రోజు చెస్తున్న పని బాగోలేదు. బిడ్డలు గుండేల మీద తంతారంటారే.. అలా తన్నావురా.. మనసు ఆవేదనతో కృంగిపోతుందిరా.. నేను, నీ తల్లి ఏడుస్తున్నాం రా.. నా బిడ్డ నన్ను కొట్టడం ఏంటిరా.. నా బిడ్డ నన్ను తాకలా.. ఇద్దరం ఘర్షణ పడ్డాం.. కొన్ని కారణాల వల్ల.. ప్రతి ఫ్యామిలీలో ఉంటాయిరా ఇవి.. అలాంటి ఫ్యామిలీ లేదంటే .. వారు కాళ్ల కడగొచ్చు.. భారత భాగవత రామాయణాలు చూసావ్ కదరా..మీ అమ్మ ఎంత కుమిలిపోతుందిరా.. అని’ మోహన్ బాబు వాయిస్ మెసేజ్ ఇచ్చారు.


మీ అమ్మ ఆస్పత్రిలో ఉంది..

మనోజ్ నీ వల్ల మీ అమ్మ హాస్పిటల్ పాలయింది. మనోజ్ నీకన్ని ఇచ్చా..‌ నాకు అపఖ్యాతి, అపకీర్తి తీసుకొచ్చావు. ప్రజాస్వామ్యంలో కొన్ని హద్దులు ఉన్నాయి. అవి నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాట విని..తాగుడుకి అలవాటు పడ్డావు.. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే పరిస్దితి తీసుకువచ్చావు.. కుల, మతం తేడా లేకుండా మనం విద్యను అందిస్తున్నాం.. మన దగ్గర చదువుకొన్న వారు ఎంతో మంది గొప్పవారు అయ్యారురా.. నువ్వు అక్కడే చదువుకున్నావు.. నటుడి అయ్యావు. తాగుడికి అలావాటు పడి, నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేసే విధానం నీచం.. భగవంతుడు చూస్తున్నాడురా .. ఎవరు తప్పు చేస్తున్నారనేది.. ఎంత అవకాశం ఇచ్చాం.. మాట్లాడుకునెందుకు అందరికీ.. నువ్వు ఎందుకు ఇలా తయారయిపోయావ్.. ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్లని కొడుతున్నావ్.. వారిని కొట్టడం మహా పాపం రా‌.. నేను దండించటం వేరు.. మోహన్ బాబు.. సినిమా ఇండస్ట్రీలో కొడతాడు తిడతాడనేది ఉండొచ్చెమో.. కానీ ఇంట్లో నువ్వు చిన్న పిల్లలను కొట్టిన దానికి చనిపోయేవాడు.. నువ్వు నీ భార్య మారి బయట ఉండమని చెప్పాను‌.. ఎన్నో సార్లు తప్పు చేసావ్.. మూడు రోజుల నుంచి వస్తున్న వార్తలు ఎంతో ఆవేదన కలిగించాయి


క్షమాపణ చెప్పాలని డిమాండ్

మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడంతో జల్ పల్లి ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మోహన్ బాబు ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. గాయపడ్డ మీడియా ప్రతినిధులకు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మీడియాపై దాడికి నిరసనగా జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. మోహన్ బాబు ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మౌనికతో మనోజ్ పెళ్లి అంటే పెద్దయ్యకు ఇష్టం లేదు: పని మనిషి

Hyderabad: ఆయిల్ పామ్ పంటపై అధికారులు దృష్టి సారించండి: మంత్రి తుమ్మల..

Updated Date - Dec 10 , 2024 | 09:04 PM