Share News

Mandakrishna madiga: హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ అరెస్ట్.. ఎందుకంటే

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:31 PM

Telangana: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో పాటు, పలువురు ఎమ్మార్పీఎస్ నేతలను ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇందిరాపార్క్ వద్ద ఎమ్మార్పీఎస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది.

Mandakrishna madiga: హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ అరెస్ట్.. ఎందుకంటే
MRPS Chief Mandakrishna Madiga

హైదరాబాద్, అక్టోబర్ 9: ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగను (MRPS Chief Mandakrishna Madiga) పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయడాన్ని నిరసిస్తూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈరోజు (బుధవారం) ఇందిరాపార్క్ ధర్నా చౌక్ నుంచి మాదిగల నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే ఈ నిరసనను పోలీసుల అడ్డుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో పాటు, పలువురు ఎమ్మార్పీఎస్ నేతలను ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇందిరాపార్క్ వద్ద ఎమ్మార్పీఎస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించ తలపెట్టిన మాదిగల నిరసన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన ఆందోళనకారులను నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Cinema Tree: ఊపిరి పోసుకున్న సినిమా చెట్టు.. ఫలించిన ప్రయత్నాలు..


ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మాదిగలకు డీఎస్సీ ద్వారా వచ్చే ఉద్యోగాలను కల్పించిన తర్వాతే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ముందుగానే నియామక పత్రాలు అందజేయడం వల్ల మాదిగలు అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా చేపట్టే ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు పాటించాలంటూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మార్పీఎస్ నేతలను , కార్యకర్తలు ఉద్యమకారులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేదా అని ప్రశ్నించారు. అలాగే ర్యాలీలు నిర్వహిస్తున్న వారిని అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమంటూ మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

TGSRTC: ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ ఛార్జీల పెంపు..



నిన్ననే హెచ్చరిక

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగవంతం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న(మంగళవారం) మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని.. మాదిగలను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల పట్ల ఎనలేని ప్రేమ ఉన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆచరించడం లేదని.. మాలల పక్షాన నిలుస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌గా మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చి.. మాలలకు ఎక్కువ టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో మాదిగలకు నాలుగు సీట్లు తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణను తొలుత దేశంలో అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పారని గుర్తుచేశారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన అర్ధ గంటకే రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారని తెలిపారు. అయితే రెండు నెలలు కాకముందే రేవంత్ రెడ్డి మాదిగలకు వెన్నుపోటు పొడిచారని మందకృష్ణ విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

NRI: వైభవంగా టీపాడ్‌ బతుకమ్మ, దసరా వేడుకలు

Gutha Sukhender: ప్రభుత్వంపై మండలి చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 09 , 2024 | 05:05 PM