TG News: కేటీఆర్ చేసిన తప్పుకు బెయిల్ కూడా రాదు: మంత్రి కోమటి రెడ్డి
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:59 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి రావటంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు బెయిల్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు మొక్కుతున్నారని, బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు శబరిమల వెళ్ళటానికి నల్ల దుస్తులు ధరించినట్లుందని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు (BRS MLAs) నల్ల దుస్తులు (Black Dress) ధరించి అసెంబ్లీకి రావటంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkata Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు (Comments) చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చిట్ చాట్‌గా మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారాక రామావు చేసింది పెద్ద తప్పు అని, ఆయన జైలుకు వెళ్ళక తప్పదని అన్నారు. కేటీఆర్ ఏడేండ్ల వరకు జైల్లోనే ఉండాల్సి వస్తుందని, ఆయన చేసిన తప్పుకు బెయిల్ కూడా రాదని మంత్రి అన్నారు.
కేటీఆర్‌కు బెయిల్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు మొక్కుతున్నారని, బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు శబరిమల వెళ్ళటానికి నల్ల దుస్తులు ధరించినట్లుందని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. శబరికి వెళ్లి కేటీఆర్ అరెస్టు అయితే బెయిల్ రావాలని మొక్కుతారని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు బెయిల్ వచ్చే ఛాన్స్ లేదని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.
కాగా ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసు (Formula E car racing case)లో బీఆర్ఎస్ (BRS) వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మాజీమంత్రి కేటీఆర్ (KTR) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏ క్షణమైనా కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు (ACB Notices) ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ (Governor Green Signal) ఇచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ అరెస్ట్‌పై రాజకీయవర్గాల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. మరోవైపు ఎలాంటి విచారణకైనా సిద్దమని కేటీఆర్ అంటున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకే ఈ కారు రేసింగ్ నిర్వహించామని కేటీఆర్ అన్నారు.
అధికారులకు సంబంధం లేదని.. పూర్తి బాధ్యత తనదేనని కేటీఆర్ ప్రకటించారు. దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని అన్నారు. కొన్నాళ్ళు జైలులో ఉంటే ఏమవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. జైల్లో యోగా చేసుకుని ఫిట్‌గా అయివస్తానని కేటీఆర్ గతంలో అన్నారు. జైలు నుంచి వచ్చాక పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునందుకే కేటీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేశారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇంకోవైపు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజల్లోకి తీసుకువెళతామని కారు పార్టీ నేతలు పేర్కొన్నారు.
కాగా ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారం పూర్తిస్థాయిలో మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకోనుంది. ఈ అంశంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించింది. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించారు.. నేడో రేపో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది.. ఈ మేరకు క్యాబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది.. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 4.10 గంటల నుంచి 8 గంటల వరకూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఇందులో జరిగిన అవినీతిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయాన్ని మంత్రులకు తెలిపారు. అనంతరం ఈ అంశంపై మంత్రుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయసాయి రెడ్డి నా భార్యను లోబర్చుకొని..: మదన్ మోహన్
అమృతసర్ పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు..
తిరుమల లడ్డూ కల్తీలో మరో ట్విస్టు..
ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..
అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News