Share News

Minister Sitakka: ప్రైవేట్ ఉద్యోగాల్లో వారికి ఉద్యోగాలు

ABN , Publish Date - Oct 14 , 2024 | 01:08 PM

ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. ఇతర వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయని, శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదని మంత్రి సీతక్క అన్నారు. పోషకాహార లోపం, ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుందన్నారు. అందుకే వాళ్లకు ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌ను ప్రారంభించామని తెలిపారు.

Minister Sitakka:   ప్రైవేట్ ఉద్యోగాల్లో వారికి ఉద్యోగాలు

హైదరాబాద్: సచివాలయంలో (Secretariat) తెలంగాణ (Telangana) వికలాంగుల జాబ్ పోర్టల్‌ (Handicapped Job Portal)ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Sitakka) ఆవిష్కరించారు ( Launched). ఈ సందర్భంగా మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్ లైన్‌లో పదిమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, దివ్యాంగులు, వయోవృద్ధులు, సాధికారత శాఖా జేడీ శైలజ, వికలాంగ సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. ఇతర వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయని, శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదని అన్నారు. పోషకాహార లోపం, ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుందన్నారు. అందుకే వాళ్లకు ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌ను ప్రారంభించామని మంత్రి తెలిపారు. ప్రైవేటు ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలని, దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే చాలని అన్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తాయని, అందుకోసమే పోస్టల్‌లో అందుబాటులోకి తెచ్చామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

సంక్షేమ నిధుల నుంచి ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నామని, ప్రైవేట్ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. గతంలో ఒక శాతం ఉంటే దాన్ని నాలుగు శాతానికి పెంచెందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు పాటిస్తామని చెప్పారు. సంక్షేమం, విద్యా, ఉద్యోగ రంగంలో దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందని స్పష్టం చేశారు. దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 50 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. దివ్యాంగులు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా మాకే.. వారి సమస్యలను షేర్ చేయొచ్చునని, మెసేజ్ పాస్ చేస్తే చాలని.. వారి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.


బ్యాక్ లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని, చాల కాలంగా పెండింగ్‌లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టామని మంత్రి సీతక్క తెలిపారు. దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం చేయూతనిస్తామని చెప్పారు. కాగా మహిళా శిశు సంక్షేమ డైరెక్టరేట్ కాల్ సెంటర్లో పదిమంది దివ్యాంగులకు మంత్రి సీతక్క అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందజేశారు. సుహాసిని -హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్, ఎం. లక్ష్మీ -ఐ టి సూపర్‌వైజర్, కాల్ ఆపరేటర్లుగా మామిడి లావణ్య, కే. లలిత, పార్వతమ్మ , మేడి శ్రీకాంత్, కే. నాగలక్ష్మి, ఎం. రజిత, సిహెచ్ సుమిత్ర తదితరులు.


ఈ వార్తలు కూడా చదవండి..

సికింద్రాబాద్ మోండ మార్కెట్ వద్ద టెన్షన్.. టెన్షన్..

ఎమ్మెల్యే రఘురామా కేసులో ట్విస్ట్..

సాహితి ఇన్ ఫ్రా ఎండీని ప్రశ్నించనున్న ఈడీ

ఏపీలో ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు..

గీసుగొండ వివాదంపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 14 , 2024 | 01:47 PM