Minister Sitakka: అందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు: మంత్రి సీతక్క
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:25 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ వాడీవేడీగానే ప్రారంభమయ్యాయి. దవ్య వినిమయ బిల్లుకుపై సభలో చర్చ జరుగుతోంది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యాలపై మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు ఒక్కొకటి నెరవేరుస్తున్నా్మని.. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. మేము చేయకపోతే ప్రజలు బుద్ది చెబుతారని.. ప్రతిపక్ష నేతలు కొంచం ఓపికగా ఉండండాలని సూచించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Meetings) ఏడో రోజూ (7th Day) వాడీ వేడీగానే ప్రారంభమయ్యాయి. దవ్య వినిమయ బిల్లుకుపై సభలో చర్చ జరుగుతోంది. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,91,159 కోట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ద్రవ్య వినిమయ బిల్లు (Exchange Bill) పై చర్చ ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి కేటీఆర్ వర్సెస్ మంత్రుల (KTR vs Ministers) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యాలపై మంత్రి సీతక్క (Minister Sitakka) మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు ఒక్కొకటి నెరవేరుస్తున్నామని.. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. మేము చేయకపోతే ప్రజలు బుద్ది చెబుతారని.. ప్రతిపక్ష నేతలు కొంచం ఓపికగా ఉండండాలని ఆమె సూచించారు.
ఇంటింటికీ ఉద్యోగం పేరుతో పదేళ్లపాటు బీఆర్ఎస్ మోసం చేసిందని.. దీంతో పదేళ్ల పాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు. అశా వర్కర్లు, అంగన్‌వాడీల తల్లిదండ్రుల పింఛను గత ప్రభుత్వం తొలగించిందని, చిరుద్యోగుల తల్లిదండ్రుల పింఛను తీసేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆమె తీవ్రస్థాయిలో ఆరోపించారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకే ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారని అన్నారామె. బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు కూడా ఇవ్వలేదని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలలపాటు జీతాలు ఇవ్వలేదని మంత్రి సీతక్క విమర్శించారు.
కేటీఆర్ మాట్లాడుతూ..
ఓపికగా ఉండాల్సింది మంత్రులేనని.. తాము కాదని కేటీఆర్ అన్నారు. వందరోజులలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ఎవరు చెప్పమన్నారని ప్రశ్నించారు. పోస్టులు పెంచమంటే పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారని, సన్నాసులు గ్రూప్ టూ వాయిదా వేయమంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని, జీవో 46 సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు కష్టానికి ఖరీదు కట్టడమే తప్పని.. రైతు భరోసా రూ. 15వేలు ఇస్తామన్నారని.. బడ్జెట్లో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ఓట్లు లేవు కాబట్టి రైతు భరోసా ఇస్తారా? ఎత్త గొడతారా?.. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన మాట నిలుపుకోవాలన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తే రెండుసార్లు ప్రకటనలు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కేవలం రూ. 12వేలు మాత్రమే రుణ మాఫీకి ఖర్చు చేశారని కేటీఆర్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో నూతన మద్యం విధానం అమలు..
Live..: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
నామినేటెడ్ పోస్టులు వారికే: సీఎం చంద్రబాబు
గవర్నర్‌గా నేడు జిష్ణు దేవ్ వర్మ ప్రమాణస్వీకారం
బినామీ పేర్లతో పెద్దిరెడ్డి భూముల రిజిస్ట్రేషన్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News