Share News

Minister Sridhar Babu: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై ఆ పార్టీల నేతలు చెప్పే కట్టుకథలను నమ్మొద్దు

ABN , Publish Date - Mar 06 , 2024 | 10:30 PM

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చెప్పే కట్టుకథలను నమ్మొద్దని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. బుధవారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ...బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు పదేళ్లలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీను ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు.

Minister Sridhar Babu: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై ఆ పార్టీల నేతలు చెప్పే కట్టుకథలను నమ్మొద్దు

జగిత్యాల: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చెప్పే కట్టుకథలను నమ్మొద్దని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. బుధవారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ...బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు పదేళ్లలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీను ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేది కాంగ్రెస్సే అని చెప్పారు. రైతుల పట్ల బీజేపీకి, బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి లేదని అన్నారు. 2025 డిసెంబర్‌కు ముందే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ఆర్థిక ఇబ్బంది ఉన్నా షుగర్ ఫ్యాక్టరీను ప్రారంభిస్తాం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఆర్థిక ఇబ్బంది ఉన్నా.. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీను ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy) అన్నారు. బుధవారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభాన్ని మేనిఫెస్టోలో పెట్టామని.. తప్పకుండా ఫ్యాకర్టీను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చెరుకు రైతుల సమస్యలు తమకు తెలుసునని అన్నారు. ఫ్యాక్టరీపై బ్యాంకుల్లో ఉన్న అప్పు వివరాలను ఆరా తీస్తున్నామని చెప్పారు. త్వరలోనే బకాయిలు చెల్లించి ఫ్యాక్టరీ పనులు మొదలు పెడుతామని స్పష్టం చేశారు. 2025 చివరి కల్లా ఫ్యాక్టరీను తెరుస్తామని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీల ప్రారంభంపై రాజకీయాలు వద్దని అన్నారు. చెరుకు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ మూత పడటానికి కారణాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఫ్యాక్టరీని ఎలా ప్రారంభించాలని ఆలోచిస్తున్నామని జీవన్‌రెడ్డి అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 11:09 PM