Share News

Sridhar Babu: జగిత్యాల ఎపిసోడ్‌పై మంత్రి శ్రీధర్ బాబు స్పందన

ABN , Publish Date - Oct 23 , 2024 | 04:04 PM

Telangana: జగిత్యాల జిల్లాలో జరిగిన హత్య ఉదంతంపై మంత్రి శ్రీధర్‌ బాబు రెస్పాండ్ అయ్యారు. హత్య చేసిన, చేయించిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అలాగే పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటామని వెల్లడించారు.

Sridhar Babu: జగిత్యాల ఎపిసోడ్‌పై మంత్రి శ్రీధర్ బాబు స్పందన
Minister Sridhar Babu

హైదరాబాద్, అక్టోబర్ 23: జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడి హత్య, ఆ తరువాత జరిగిన పరిణామాలపై మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) స్పందించారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్‌పై సీరియస్‌గా ఉన్నామన్నారు. మర్డర్ ఎవరు చేసినా.. ఎవరు చేయించినా వదిలేది లేదని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీతో ఇప్పటికే మాట్లాడటం జరిగిందని తెలిపారు. జీవన్ రెడ్డితో ఇప్పటికే పీసీసీ చీఫ్ మాట్లాడారని తెలిపారు. ‘‘జీవన్ రెడ్డితో నేను కూడా మాట్లాడుతా’’ అని మంత్రి చెప్పారు. జీవన్ రెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ నేత అని... ఆయన సేవలను తాము వినియోగించుకుంటామన్నారు. పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించమని వెల్లడించారు. చనిపోయిన బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Babitha Phogat: డబ్బులు అడిగితే స్పందించలేదు.. ’దంగల్‘ టీంపై బబిత ఫొగాట్ కామెంట్స్


నాకెటువంటి సంబంధమూ లేదు: ఎమ్మెల్యే

‘‘జీవన్ రెడ్డి కంటే ముందే మా కుటుంబం కాంగ్రెస్‌లో ఉంది. గంగారెడ్డి హత్యకు నాకు సంబంధం లేదు’’ అని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. వేరే కారణాలతోనే గంగారెడ్డి హత్య జరిగిందన్నారు. గంగారెడ్డి హత్యతో కొందరు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. తాను జగిత్యాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. గంగారెడ్డి హత్యపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిందే అని ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు.


మరోవైపు ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గంగారెడ్డి హత్యకు నిరసనగా జగిత్యాలలో నిరసనలు కూడా చేపట్టారు. ఒకనొక సమయంలో పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో ఫోన్‌లో మాట్లాడే సమయంలోనూ ఎమ్మెల్సీ అసహనం వ్యక్తం చేశారు. ‘‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితానికి కాంగ్రెస్‌ మంచి బహుమతి ఇచ్చింది. పార్టీలో కొనసాగడం సాధ్యం కాదు. ఇంతకాలం మానసికంగా అవమానాలకు గురైనా భరించా. ఇప్పుడు భౌతిక దాడులకు పాల్పడుతురు. దయచేసి నన్ను క్షమించండి అన్నా’’ అంటూ జీవన్ రెడ్డి ఫోన్‌ కట్ చేశారు. అంతేకాకుండా... ‘‘మీ పార్టీకి.. మీకు ఓ దండం.. మీ పార్టీలో నేను ఇక ఉండను.. ఇక నైనా బతక నివ్వండి’’ అంటూ విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌తో వ్యాఖ్యలు చేశారు.

Cyclone Dana: దానా తుపానుకి ఆ పేరు ఎలా వచ్చింది.. అర్థం ఏమిటో తెలుసా


అయితే గంగారెడ్డి హత్యతో జగిత్యాల జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిరసనకు దిగారు. జగిత్యాలలోని పాత బస్టాండ్ ఆవరణలో నడి రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కూడా జీవన్‌రెడ్డితో కలిసి ఆందోళనకు దిగారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ కార్యకర్తల నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఎమ్మెల్సీ ధర్నా చేశారు. మరోవైపు గంగారెడ్డిని హత్య చేసిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అలాగే నిందితుడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్ డేటా, వాట్సాప్ డేటాను పరిశీలిస్తున్నారు. అలాగే పోలీసులతో నిందితుడికి సంబంధాలపై విచారణ కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

Viral Video: కారుపై ఎల్‌ఈడీ స్క్రీన్ పెట్టారనుకుంటే పొరపాటు పడ్డట్లే.. దగ్గరికి వెళ్లి చూస్తే షాకింగ్ సీన్..

Kaleshwaram Project: కాళేశ్వరం విచారణ.. ఈఎన్‌సీపై ప్రశ్నల వర్షం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 23 , 2024 | 04:06 PM